న్యూఢిల్లీ : ఇండియన్ ఎక్స్‌పో 2020 లో భాగంగాప్రధానమంత్రి నరేంద్రమోడీతో అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్, హీరో రామ్ చరణ్ భార్య కొనిదెల ఉపాసన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మేరకు ఆమె ‘ఇండియన్ ఎక్స్‌పో 2020లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలుసుకున్నాను.
ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపర్చడం, మహిళా సాధికారత, సంస్కృతీ పరిరక్షణ మీద ప్రధానంగా దృష్టిసారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే సాంకేతికత శక్తి మనకు ఎన్నో అవకాశాన్ని ఇస్తుంది. మనం దానిని తెలివిగా ఉపయోగించుకోవాలి`అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లోనే దుబాయ్ ఎక్స్‌పో 2020ని వారు ట్యాగ్ చేశారు.
