NTV Telugu Site icon

Ragging: గాంధీ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి సస్పెండ్

Untitled 4

Untitled 4

Gandhi Medical College: ఏదైన హద్దుల్లో ఉంటె అందం. హద్దు మీరితే అనర్ధం. ఈ మాట ఇప్పుడు చెప్పడానికి కారణం పడగ విప్పిన ర్యాగింగ్ పెనుభూతం. సాధారణంగా కళాశాల విద్య, వికాసాన్ని అందించడంతోపాటుగా ఎన్నో మధుర జ్ఞాపకాలను కూడా అందిస్తుంది. కళాశాలలో అల్లరి చేయడం సహజం. అల్లరి చెయ్యాలి కానీ ఆ అల్లరి కూడా అందంగా ఉండాలి. తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండాలి. జూనియర్స్ ని సోదర భావంతో చూడాలి. అన్నింటికీ మించి విద్యార్థికి క్రమశిక్షణ, సంస్కారం ఉండాలి. వీటిలో ఏది లోపించిన ఆ విద్యార్థి జీవితం పాడైనట్లే. అయితే సరదాగా సాగాల్సిన విద్యార్థుల జీవితం ర్యాగింగ్ ఉచ్చులో చిక్కుకుంటుంది. కొందరు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో రాక్షసులుగా మారుతున్నారు.

Read also:Alluri Sitharama Raju district: దసరా సెలవులకు వెళ్లిన విద్యార్థికి అస్వస్థత.. డోలీలో మోసుకెళ్లినా దక్కని ప్రాణాలు

ఈ ర్యాగింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు కోకొల్లలు. ఆ మరణాలను అరికట్టడానికి కట్టిన చర్యలు చెప్పట్టారు, ప్రభుత్వం, కళాశాలల యాజమాన్యం. ఇందులో భాగంగా యాంటీ ర్యాగింగ్ కమిటీని ప్రతి కళాశాలలో నియమించడం జరిగింది. దీనితో ర్యాగింగ్ కొంతవరకు తగ్గింది. అయితే మళ్ళీ హైదరాబాద్ లో ర్యాగింగ్ పెనుభూతం పంజా విసురుతుంది. గత కొద్దీ రోజుల క్రితం గాంధీ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కు పాల్పడిన 10 మందిని యాంటీ ర్యాగింగ్ కమిటీ సస్పెండ్ చేసింది. అయితే తాజాగా మరో విద్యార్థి ర్యాగింగ్ కు పాలపడినట్లు నిర్ధారించబడింది. దీనితో యాంటీ ర్యాగింగ్ కమిటీ మరో విద్యార్థిని సస్పెండ్ చేసింది.

Show comments