Site icon NTV Telugu

కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ..

కేఆర్ఎంబి చైర్మన్ కు తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ మరో లేఖ రాశారు. ఈ నెల 9న జరగాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని ఈ లేఖలో తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోరారు. ఈ నెల 9న జలసౌధాలో కేఆర్ఎంబీ చైర్మన్ ఆర్పీ సింగ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఉండనుంది.

read aslo : చేనేత బీమా పథకం : సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

అయితే… దీనిపై అభ్యంతరం చెప్పిన తెలంగాణ సర్కార్‌… వర్ష కాలం సీజన్ పనులతో పాటు.. కొన్ని ప్రాజెక్టుల పనులతో ఇరిగేషన్ ఉన్నతాధికారులు బిజీగా ఉన్నట్లు వివరిస్తూ లేఖ రాసింది. ఈ నెల 9న జరగాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేసి… ఈ నెల 20న ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. దీనిపై కేఆర్‌ఎంబీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version