Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో నేడు హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇవాల వేడుకలు జరగనుండగా.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అంజన్న సన్నిధికి లక్షలాది మంది అంజనా దీక్షాపరులు తరలి వచ్చారు. ప్రతి సంవత్సరం వైశాఖ ముల్దశమి రోజున హనుమంతుని తిరునక్షత్ర జయంతి వేడుకలను ఆలయ సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలో త్రికుండమంతిమ యజ్ఞం, వార్షికోత్సవం రోజున పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భద్రాచలం సీతారాచంద్రస్వామి ఆలయం నుంచి స్వామివారికి పట్టువస్త్రాలు పంపారు. వాటిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వామికి అందజేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ముందస్తుగా 3.60 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా వెంటనే పులిహోర సిద్ధం చేయన్నారు. అంజన్న దర్శనానికి 14 కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఉత్సవాల సందర్భంగా కొండగట్టు ఆలయంలో నిఘా పెంచేందుకు 104 సీసీ కెమెరాలతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఆలయం తరపున ఆలయం లోపల, బయట ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలకు అదనంగా 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
Hanuman jayanthi: తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు.. ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతి