Anjan Kumar Yadav: బీజేపీ వాళ్లు బద్మాష్ కొడుకులు.. బట్టేబాజ్ మాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anjan Kumar Yadav Comments on BJP, Rajgopal Reddy: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తరువాత కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ బీజేపీపై, కోమటి రెడ్ది రాజగోపాల్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. బీజేపీ వాళ్లు బద్మాష్ కొడుకులు, బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్మాష్ మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ వాళ్లు దొంగ రామ భక్తులని.. అసలు భక్తుల మేమే అని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు.
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. మోదీ దేవుడన్న సంజయ్.. తెలంగాణకు మీ దేవుడు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సంస్థల్ని బీజేపీ నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. బండి సంజయ్ పార్లమెంట్ లో తెలంగాణ కోసం ఏం చేశావని ప్రశ్నించారు. రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ సముద్రం లాంటిది.. దాన్ని ఎవరూ ఖతం చేయలేరని అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పోయారని చెబుతున్న రాజగోపాల్ రెడ్డిని నువ్వేం చేశావని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్ది పాత రికార్డులు తిప్పడం.. ఫోజులు కొట్టడం కాదని విమర్శించారు.
Also Read
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
- TGSPDCL : విద్యుత్ డిమాండ్లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
- Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
- AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో 'ఏఐ' విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
Read Also: Raghunandan Rao: రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి
రాజగోపాల్ రెడ్డి నువ్వు ఎలా ఎంపీ అయ్యావని అన్నారు. వైఎస్ఆర్ ఆఖరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అని .. మరి నువ్వేం అంటున్నావని.. కాంగ్రెస్ పార్టీని శవం అంటున్నావు.. శవం దగ్గర ఇన్ని రోజులు ఎందుకు ఉన్నావని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ సానుభూతితో గెలిచి ఎక్కువగా మాట్లాడుతున్నాడని.. బీజేపీలోకి పోయి మాకు నీతులు చెబుతున్నావా..? అని ఎద్దేవా చేశారు. రాజగోపాల్ కానీ.. ఇంకెవరైనా కానీ కాంగ్రెస్ పార్టీని అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!