NTV Telugu Site icon

Anesthetic Injection: ఖమ్మంని కమ్మేసిన మత్తు.. వెలుగులోకి మరో ‘సూది హత్య’

Anesthetic Injection

Anesthetic Injection

ఖమ్మంలో మత్తు ఇంజెక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి. మొన్న తాజాగా లిప్ట్‌ అడిగి ఇంజక్షన్‌ ఇచ్చి బైక్‌ తో పరాయ్యాడు నిందితుడు ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సమగ్ర విచారణ జరిపిన పోలీసులు భార్యే పక్కడ్బందీగా భర్త పై హత్య చేయించిందని నిర్ధారణకు వచ్చారు. దీనికి గల కారణ వేరొకరితో వివాహేతర సంబంధమే అని పోలీసులు తేర్చారు. ఈ ఘటన మరువకముందే మరో మత్తు ఇంజక్షన్‌ ఘటన వెలుగుచూసింది. అతనికి ఇద్దరు భార్యలు. వాళ్ళిద్దరి మధ్య తరుచూ గొడవలు. ఇద్దరిలో ఒకరిని చంపేస్తే తప్ప తనకు మనశ్శాంతి లేదు అనుకున్నాడు. ఈనేపథ్యంలో.. చిన్న భార్యకు మత్తుమందు ఇచ్చి చంపేశాడు. ఖమ్మం జిల్లాలో 50 రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం నగరంలోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా, అనస్థీషియా వైద్యుడి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అతనికి మొదట తన మేనకోడలితో వివాహం అయ్యింది వీరికి పిల్లలు పుట్టలేదు. అయితే.. పిల్లలు కావాలని తనకంటే ఇరవై ఏళ్ల చిన్నది అయిన నవీనను రెండో పెళ్లి చేసుకున్నాడు. కాగా.. కొద్దిరోజులు ముగ్గురూ అన్యోన్యంగానే ఉన్నారు. అయితే.. నవీనకి పాప పుట్టింది. దీంతో.. ఇద్దరు భార్యల మధ్యగొడవలు మొదలయ్యాయి. ఈక్రమంలోనే నవీన రెండోసారి గర్భం దాల్చింది. రోజూ గొడవలతో విసిగిపోయిన భిక్షం భార్య నవీనను హతమార్చాలని పథకం వేశాడు.

భార్య ప్రసవంకోసం జూలై 30న ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆమెకు ఆడ శిశువు పుట్టింది, మరుసటి రోజు తెల్లవారేసరికి నవీన ఆస్పత్రిలోనే మృతిచెందింది. అయితే.. సరిగ్గా వైద్యం చేయకపోవడం వల్లే తన భార్య చనిపోయిందంటూ తన బంధువులతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు భిక్షం.  దీంతో.. నవీన హఠాత్తుగా ఎందుకు చనిపోయింది అర్థం కాని వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. ఇక చేసేదేమి లేక బిక్షం కూతుర్లు ఇద్దరికీ ఆర్థిక సాయం చేస్తామని సదరు ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే.. ఆందోళన విరమించిన భిక్షం నవీన మృతదేహాన్ని ఊరికి తీసుకు వెళ్ళకుండా ఖమ్మంలోనే స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశాడు. దీంతో.. నవీన అంత్యక్రియలను ఖమ్మంలో నిర్వహించడంతో ఆసుపత్రి సిబ్బందిలో అనుమానం మొదలైంది.

ఇక హాస్పిటల్ లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే.. ప్రసవం జరిగిన రోజు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బిక్షం తన భార్యకు ఇంజక్షన్ ఇవ్వడం.. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకు వెళ్లి హడావిడి చేయడం కనిపించాయి. దీంతో.. నిర్ఘాంతపోయిన ఆస్పత్రి యాజమాన్యం ఖమ్మం టూ టౌన్ పోలీస్ లను సంప్రదించింది. అయితే.. స్వాతంత్ర వజ్రోత్సవాలు, వినాయక చవితి నేపథ్యంలో ఈ విషయాన్ని పోలీసులు లైట్ తీసుకున్నారు. అయితే.. ఇటీవల భిక్షంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తన రెండో భార్య నవీనకు ఇంజక్షన్ ద్వారా అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి చంపినట్లు ఒప్పుకున్నాడు. అయితే.. జమాల్ సాహెబ్ ఘటనతో ఇది కూడా వెలుగులోకి వచ్చింది.