NTV Telugu Site icon

JEE Exam: జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్.. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్ధి అరెస్ట్‌

Jee

Jee

JEE Exam: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ 1 సహా అనేక పరీక్షలు రద్దు చేయడంతో.. లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. పేపర్ లీకేజీ ఘటనపై సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఇప్పటికి సుమారు 45 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మరిచిపోకముందే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో కీలక సూత్రధారులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read also: ATM : కార్డుతో పనిలేదు.. స్కాన్ చేసినా ATMనుంచి డబ్బులు వస్తాయి

జేఈఈ పరీక్షలో నలుగురు విద్యార్థులు స్మార్ట్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. వారు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కాపీ చేశారు. ఆదివారం పరీక్ష జరగగానే హైదరాబాద్ పోలీసులు స్మార్ట్ కాపీయింగ్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఈ స్మార్ట్ కాపీయింగ్‌లో కీలక సూత్రధారి కడప జిల్లాకు చెందిన టాపర్‌గా గుర్తించారు. టెన్త్, ఇంటర్ లో టాపర్. అయితే తన స్నేహితులకు మంచి మార్కులు పడేలా ఈ కాపీయింగ్ చేసినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్‌లోని ఎస్వీఐఈ పరీక్షా కేంద్రం నుంచి అతడు ఈ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. హైటెక్ సిటీలోని ఓ కళాశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలో ఎలాగైనా మంచి మార్కులు సాధించాలనుకున్నారు. వీరిలో కడప జిల్లాకు చెందిన విద్యార్థి ఒకరు. టెన్త్, ఇంటర్‌లో టాపర్. తన స్నేహితులు ఎలాగైనా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఓ కడప విద్యార్థి ఈ స్మార్ట్ కాపీయింగ్ చేశాడు. తన సమాధాన పత్రాన్ని వాట్సాప్ ద్వారా స్నేహితులకు పంచుకున్నాడు. వివిధ సెంటర్లలో ఉన్న నలుగురు విద్యార్థులకు వాట్సాప్ ద్వారా సమాధాన పత్రాన్ని పంపించాడు.

అయితే ఎస్వీఐటీ కళాశాల సెంటర్‌లో పరీక్ష రాస్తున్న కడప విద్యార్థిపై అబ్జర్వర్‌కు అనుమానం వచ్చింది. అతడిని తనిఖీ చేయగా ఓ స్మార్ట్ ఫోన్ దొరికింది. దీంతో స్మార్ట్ కాపీయింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు చైతన్యను హైదరాబాద్‌లోని దిల్‌ సుఖ్‌ నగర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేఈఈ పరీక్షలో మాస్ కాపీయింగ్‌పై మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రశ్నిస్తున్నారు. నిందితులు వాట్సాప్‌తో పాటు మరేదైనా ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పరీక్షా కేంద్రాల్లో నలుగురికి సహకరించిందెవరన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. జేఈఈ పరీక్షలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి పరీక్ష రాసిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలు ఈ ఏడాది రెండు దశల్లో జరిగాయి. జేఈఈ తొలి దశ పరీక్ష ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగింది. జేఈఈ రెండో దశ పరీక్ష ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి 13 వరకు జరిగింది. దేశవ్యాప్తంగా 23 ఐఐటీ కేంద్రాల్లో 16,598 సీట్లు ఉన్నాయి.
Karnataka : దారుణం.. భార్య మార్మాంగాలను కోసి హత్య చేసిన భర్త..