Site icon NTV Telugu

Communal Harmony: ఇదికదా మతసామరస్యం అంటే..

Kukatpally

Kukatpally

మనదేశం ఎన్నో కులాలు మతాల సమాహారం. సర్వ మానవ సౌభ్రాతృత్వం మనం ప్రపంచానికి నేర్పిన పాఠం. నాది, నేను కాదు.. మనది, మనం అనే వసుధైక కుటుంబ భావన భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నతంగా నిలుపుతోంది. మనదేశంలో ప్రతిరోజూ ఏదో మతానికి, దైవానికి సంబంధించిన పండుగలు, ఉరుసులు జరుగుతుంటాయి. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వినాయకచవితి వేడుకల్లో లక్షలాదిమంది ముస్లిం సోదరులు పాల్గొంటూ ఉంటారు.

పిల్లా పెద్దా.. అందరికీ మేమున్నాం అంటూ భరోసా.. మజ్జిగ గ్లాసు అందిస్తున్న ముస్లిం యువత 

కూకట్ పల్లి పోచమ్మ తల్లి ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమంలోని శోభాయాత్రలో దృశ్యం ..

Read Also: Video call delivery : త్రీ ఇడియట్స్ సీన్ రిపీట్.. అది రీల్.. ఇది రియల్

వినాయక నిమజ్జనం వేళ ఎంతోమంది గణేష్ మండపాలకు స్వాగతం పలుకుతుంటారు. అదే విధంగా ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నాడు ఇఫ్తార్ విందుకి హాజరై హిందు సోదరులు తమ విశిష్టతను చాటుకుంటూ ఉంటారు. ముస్లింలకు కూడా హిందువులు ఇఫ్తార్ విందు ఇస్తారు.

కూకటపల్లిలో వెలసిన పోచమ్మ తల్లి ఆలయానికి ఎంతో ఘనమయిన చరిత్ర ఉంది. ఆ ఆలయానికి వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఆలయం చుట్టుపక్కల ఉండే ముస్లిం సోదరులు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారు. మంచి ఎండలో అమ్మవారిని దర్శించుకునే భక్తులకు చల్లని మజ్జిగ గ్లాసు అందిస్తారు. అమ్మవారి శోభాయాత్రలో ముస్లిం సోదరులు మజ్జిగ పంచి మనమందరం ఒక్కటే అన్న భావం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలాంటి దృశ్యాలు మనకు అనేక చోట్ల కనిపిస్తాయి. మనం మనం భారతీయులం.. మనమంతా ఒక్కటే అనే ఐక్యభావన మన భారతీయ ఔన్నత్యాన్ని చాటుచెబుతోంది. ఇది కదా మనం అంతా భావించే మతసామరస్యం..పోచమ్మ తల్లి సాక్షిగా వెల్లివిరిసిన మతసామరస్యం ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

కూకట్ పల్లి నల్ల చెరువు వద్ద ఉన్న అతి పురాతనమైన పోచమ్మ తల్లి ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సోమవారం అమ్మవారి శోభాయాత్ర చిత్తారమ్మ దేవాలయం నుండి ప్రారంభమైంది ..ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రలో పాల్గొన్నారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. కూకట్  పల్లి గ్రామం ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో పాడిపంటలతో కళకళలాడుతూ ఉండేదని అతి పురాతనమైన కూకట్ పల్లిలోని అన్ని దేవాలయాలను పునర్నిర్మించి భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక శక్తిని అందించడమే లక్ష్యంగా అందులో తాను కూడా భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు.. 16వ తేదీన జరిగే పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు… ఈ సందర్భంగా కోలాట విన్యాసాలు ఊరేగింపు ఆకట్టుకున్నాయి.

Read Also: AU Drugs Culture: ఏయూలో డ్రగ్స్ కల్చర్.. ఈ విశాఖకు ఏమైంది?

Exit mobile version