Site icon NTV Telugu

రాష్ర్టానికి అమూల్‌ సంస్థ రావడం గర్వకారణం: కేటీఆర్‌

రాష్ర్టానికి అమూల్‌ సంస్థ రావడం గర్వకారణమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో ఎన్నో సంస్థలు వచ్చాయని, ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని మంత్రి అన్నారు. ఇప్పుడు అమూల్‌ సంస్థ రాష్ర్టానికి రావడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని కేటీఆర్‌ అన్నారు.రాష్ర్ట ప్రభుత్వం, అమూల్‌ సంస్థ మధ్య ఒప్పందం కుదిరినట్టు కేటీఆర్‌ తెలిపారు.

Read Also: వైసీపీ పతనం ప్రారంభమైంది: జీవీఎల్‌ నరసింహరావు

ఒప్పందంలో భాగంగా బేకరీ తయారు ప్లాంట్‌ను అమూల్‌ సంస్థ రాష్ర్టంలో ఏర్పాటు చేయనుంది. ప్లాంట్‌ నిర్మాణానికి మొదటి దశలో రూ.300 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్న అమూల్‌.. రెండో దశలో మరో రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంస్థ యాజమాన్యానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే పనులను ప్రారంభిస్తుందని మంత్రి వెల్లడించారు.

Exit mobile version