Site icon NTV Telugu

Amit Shah-KTR: లాస్ట్ మినిట్‌లో కేటీఆర్ తో అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు

Ktr Amithsah

Ktr Amithsah

Amit shah-KTR: కేంద్ర మంత్రి అమిత్‌తో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ భేటీ కాలేదు. ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకున్నా అమిత్ షా బిజీగా ఉండడంతో సమావేశం రద్దయింది. అమిత్ షా ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని, కలవడం కుదరదని కేంద్ర హోంశాఖ అధికారులు కేటీఆర్ కు సమాచారం అందించారు. దీంతో రెండు రోజులు ఢిల్లీ పర్యటనలో వున్న మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ రోడ్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములు అడ్డంకిగా మారాయి. ఇందులో కేంద్ర హోంశాఖ భూములు కూడా ఉండడంతో సంబంధిత మంత్రితో చర్చించి సమస్యను పరిష్కరించాలని కేటీఆర్ ఆలోచించారు. అంతేకాదు, విభజన చట్టంలోని అంశాలు, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రమంత్రితో చర్చించేందుకు హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావాలని కేటీఆర్ భావిస్తున్నారు. కానీ కేటీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా అమిత్ షాను కలవలేకపోయారు.

Read also: Anasuya: జిమ్‌లో చెమటలు చిందిస్తున్న అనసూయ

తెలంగాణ బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో అమిత్ షా శనివారం భేటీ అయ్యారు. ఈశాన్య రాష్ట్రాల బీజేపీ నేతలతోనూ అమిత్ షా సమావేశమయ్యారు. కానీ కేటీఆర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చినా కలవకపోవడంతో బీఆర్ ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి అమిత్ షాకు రాజకీయాలపై ఉన్న శ్రద్ద పాలనపై లేదని…అందుకే పార్టీ నేతలతో సమావేశమై కేటీఆర్ కు సమయం ఇవ్వలేదన్నారు. కేటీఆర్‌ను అర్ధరాత్రి వరకు ఆగేలా చేసి.. చివరకు అపాయింట్‌మెంట్ రద్దు చేసి అవమానకరంగా ప్రవర్తించారని బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీ అయ్యారు.

Read also: Uttarakhand : కేదార్‌నాథ్‌లో దారుణం.. గుర్రానికి బలవంతంగా గంజాయి..ఆపై..

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్ధికి కేటీఆర్ రక్షణ శాఖ భూములు ఏ విధంగా అడ్డంకిగా మారాయన్నది కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కేటీఆర్ భేటీలో వివరించారు. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల విస్తరణకు రక్షణ భూములు పెద్ద అడ్డంకిగా మారాయని, వాటిని వెంటనే జీహెచ్ ఎంసీకి బదిలీ చేయాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ ను కేటీఆర్ కోరారు.కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెందిన హర్దీప్ సింగ్ పూరీని కేటీఆర్ కలిశారు. ఈ సమావేశంలో కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో లక్డీకపూల్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ వరకు 26 కిలోమీటర్లు, అలాగే నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు ఐదు కిలోమీటర్ల మేర మెట్రోను ఆమోదించి ఆర్థిక సహకారం అందించాలని కేంద్రమంత్రికి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం తరహాలో పట్టణ పేదల కోసం ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని తీసుకురావాలని కేంద్రమంత్రికి కేటీఆర్ ప్రతిపాదించారు.
Astrology: జూన్‌ 25, ఆదివారం దినఫలాలు

Exit mobile version