NTV Telugu Site icon

Amit Shah tour in Telangana: మరోసారి మోడీ టూర్​​ క్యాన్సిల్​.. 11న అమిత్‌ షా పర్యటన

Modi, Amitsah

Modi, Amitsah

Amit Shah tour in Telangana: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 13న రాష్ర్టానికి పీఎం మోడీ తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. కాగా.. ఈ నెల 13న రాష్ట్రానికి ప్రధాని మోడీ రావాల్సి ఉంది. ఈ సందర్భంగా.. షెడ్యూల్‌ కూడా ఖరారైంది. అయితే.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం రానున్నట్టు ప్రకటించారు. కాగా.. అనివార్య కారణాల వల్ల తెలంగాణ పర్యటనను ప్రధాని మరోసారి వాయిదా పడటంతో చర్చకు దారితీస్తోంది. అయితే గత నెలలోనే వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ తెలంగాణకు రావాల్సి ఉండగా.. అప్పుడు కూడా తెలంగాణ పర్యటనను ప్రధాని వాయిదా వేసుకున్నారు. ఈనేపథ్యంలో.. వందేభారత్‌ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఇక మళ్లీ తాజాగా ఈ నెల 13నాటి తెలంగాణ పర్యటన కూడా వాయిదా పడటంతో తెలంగాణ పర్యటన అంటేనే మోడీ వెనక్కు వెలుతున్నారని చర్చ జరుగుతుంది. ఇది ఒక్కసారి కాదని రెండో సారి అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారంది. అయితే మోడీ పర్యటన రద్దైన.. అమిత్‌ ఈనెల తెలంగాణ పర్యటన ఖరారు కావడం సంచలనంగా మరింది. మోడీ పర్యటన 13న ఉండగా అది రద్దైంది అయితే.. అమిత్‌ షా పర్యటన 11న ఖరారు కావడంతో.. అంటే రెండు రోజుల ముందే తెలంగాణ పర్యటనను ఖరారు చేశారు. దీంతో మోడీ రాక పెండింగ్‌ లో పడింది. అమిత్‌ షా రాక ఖరారైందంటూ గుస గుసలు వినపిస్తున్నాయి.

Read also: Drugs: సబ్బుల్లో మత్తుపదార్థాలు.. 33.6 కోట్ల విలువైన కొకైన్ సీజ్‌

11న అమిత్‌ షా ..
అయితే.. రానున్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా ఎన్నికల యాక్షన్‌ ప్లాన్‌ అమలును బీజేపీ జాతీయ నాయకత్వం షురూ చేసింది. ఈనేపథ్యంలో.. రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలు జరపున్నారు. ఫిబ్రవరి నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన ఖరారైంది. అయితే.. ఈ నెల 11న అమిత్‌ షా రాష్ట్ర పర్యటనకు రానుండగా, లోక్‌సభ ప్రవాస్‌ యోజన కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాగా..ఆదిలాబాద్‌, పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్లు లేదా మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు పార్లమెంట్‌ స్థానాల్లో అమిత్‌ షా పర్యటన ఉండనుండగా.. పార్లమెంట్‌ స్థానాలతో సంబంధం లేకుండా ఏదైనా ఒక శక్తి కేంద్రంలోని కార్యకర్తలతో అమిత్‌ షా భేటీ కానున్నారు. అయితే.. సంస్థాగతంగా పార్టీ ఎంతమేరకు బలోపేతమైందనే విషయాలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. ఇక .. వాస్తవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా టూర్‌ గత నెల 28, 29వ తేదీనే ఉండాల్సి ఉంది. ఈసందర్భంగా.. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఆయన టూర్‌ వాయిదా వేసుకున్నారు. కాగా.. ఈ నెల 11న ఆయన తెలంగాణ పర్యటన ఖరారైంది.

జేపీ నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ నెలాఖరును తెలంగాణ పర్యటనకు రానున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక .. జేపీ నడ్డా పర్యటించే నియోజకవర్గాలు త్వరలోనే ఖరారు కానున్నాయని తెలిపారు. అయితే.. రాష్ట్ర పర్యటన సందర్భంగా తెలంగాణ పార్టీ కార్యవర్గంతోనూ నడ్డా భేటీ అవుతారు. ఇక.. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అనుసరిస్తున్న వ్యూహాలపై చర్చించనున్నారు.
Samath Kumb: నేటి నుంచి సమతా కుంబ్‌ ఉత్సాలు.. 9 కుండాలతో యాగం

Show comments