NTV Telugu Site icon

Amit Shah: హైదరాబాద్‌కు రానున్న అమిత్ షా.. ఎప్పుడంటే..?

Amith Shah

Amith Shah

Amit Shah: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధించడమే కాకుండా ఓటింగ్ శాతాన్ని కూడా మెరుగుపరుచుకుంది. అయితే ఇప్పుడు బీజేపీ నాయకత్వం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 28న తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో అమిత్ షా సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుల స్థాయి నుంచి వెయ్యి మందికి పైగా నాయకులు హాజరవుతారని సమాచారం. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేదు. అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మైనా.. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం రావడం లేదు. రాష్ట్ర నాయకత్వం, హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య సైలెంట్ వార్ నడుస్తోందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిది మందిలో ఒక్కరే సీనియర్‌ని, వరుసగా మూడు ఎమ్మెల్యేలుగా గెలిచిన రాజాసింగ్ తనకు పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

Read also: Rajanna Sircilla: క్రిస్మస్ వేడుకల్లో విషాదం.. గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి

అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం రాజాసింగ్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. తెలుగు స్పష్టంగా మాట్లాడలేకపోవడం ఆయనకు అడ్డంకిగా మారగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ తరచూ వివాదాలకు దిగడం మరో అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ కు ఫ్లోర్ లీడర్ ఇస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని నాయకత్వం భావిస్తోంది. ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. కామారెడ్డిలో గెలిచిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మరికొందరు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. పెద్దవాడైన ముథోల్ ఎమ్మెల్యే రాంరావు పవార్ పేరు తెరపైకి తెచ్చినా.. భాషా సమస్య ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి, రమణారెడ్డిలలో ఒకరికి ఫ్లోర్ లీడర్ పదవి దక్కే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 28న అమిత్ షా నేతృత్వంలోని శాసనసభాపక్ష నేత ఎన్నికపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈసారి తెలంగాణలో కనీసం పది పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉంది. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీలో 8 సీట్లు గెలుచుకుని ఊపుమీదున్న బీజేపీ.. లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది.
Swami Prasad Maurya : అఖిలేష్ యాదవ్ కు పెద్ద తలనొప్పిగా మారిన స్వామి ప్రసాద్ మౌర్య