Site icon NTV Telugu

Kishan Reddy: త్వరలోనే శ్రీశైలానికి అమిత్ షా.. దర్శనానికి రైల్వే మంత్రిని కూడా తీసుకొస్తా

Kishanreddy

Kishanreddy

శ్రీశైల మల్లన్న దర్శనానికి రైల్వే మంత్రిని కూడా తీసుకొస్తానని, త్వరలోనే శ్రీశైలానికి అమిత్ షా వస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శ్రీశైలంలో ప్రసాదం స్కీం పనులను పరిశీలించారు. ప్రసాదం స్కీమ్ పనులన్నీ పూర్తి వచ్చే నెలలో నేను ఏపీ మంత్రి ఎమ్మెల్యేతో ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. శ్రీశైలానికి రైల్వే మార్గానికి రైల్వే మంత్రితో మాట్లాడతా అన్నారు. గోశాలలోని 1300 గోవులు వున్నా కొన్ని గోవులు బలహీనంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గోవుల మేతకు దగ్గరలోని అడవిలోకి వెళ్లేందుకు అటవీశాఖతో మాట్లాడుతా అని అన్నారు. శ్రీశైలానికి చేరువలో రైల్వే మార్గానికి చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ నుండి కూడా రైల్వే మార్గం వచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. శ్రీశైలంలో యాంఫి థియేటర్ నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయానికి దూరంగా యాంఫి థియేటర్ ఎందుకు నిర్మించాలని అధికారులను ప్రశ్నించారు. యాంఫి థియేటర్ చూడ్డానికి భక్తులు ఎలా వస్తారని అధికారులు నిలదీశారు. ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తారా అంటూ అధికారులను మందలించారు. ఇప్పటికే రూ. 7.99 కోట్లు యాంఫి థియేటర్ నిర్మాణానికి అధికారులు ఖర్చుపెట్టారని తెలిపారు.
Mikhail Gorbachev: సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడి మరణం.. ప్రచ్ఛన్న యుద్ధం ముగించిన వ్యక్తిగా గుర్తింపు

Exit mobile version