NTV Telugu Site icon

Amit Shah: సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణకి విముక్తి లభించేది కాదు

Amith Shah

Amith Shah

Amit Shah: సర్దార్ పటేల్ లేకపోతే.. తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించకపోయేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దేశమే సర్వస్వమే నినాదంతో.. ఆపరేషన్ పోలోను ప్రారంభించారన్నారు. రక్తం చుక్క పారకుండా.. తెలంగాణకు స్వాతంత్య్రం అందించారన్నారు. పటేల్, కేఎం మున్షీ సంయుక్త ఆధ్వర్యంలో ఇది జరిగిందన్నారు. బ్రిటిషర్ల నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 399 రోజుల పాటు ఇక్కడ పోరాటం జరిగిందన్నారు.ఉస్మానియాలో వందేమాతరం ఉద్యమం, ఆర్య సమాజ్, హిందూ మహాసభ వంటి సంస్థలెన్నో కలిసి ఉద్యమాలు చేశాయన్నారు. 75 ఏళ్ల వరకు దేశంలోని ఏ ప్రభుత్వం కూడా.. మన యువతకు మన స్వాతంత్య్ర పోరాటాన్ని గురించి చెప్పేందుకు ప్రయత్నించలేదన్నారు. మోదీకి ఈ సందర్భంగా.. ధన్యవాదములు తెలియజేస్తున్నానని తెలిపారు. 17 సెప్టెంబర్ కు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపాలని ఆయన నిర్ణయించారని తెలిపారు. యువతకు దేశభక్తి, మనసంస్కృతికి గురించి మన పెద్దల పోరాటం గురించి తెలియాలన్నారు. మన పోరాటం చేసిన వారిని స్మరించుకోవాలన్నారు. వారు కలలుగన్న రాష్ట్రాన్ని నిర్మించుకునేందుకు కృషి చేయాలన్నారు.

సశస్త్ర సీమాబల్ ఉద్యోగులకోసం క్వార్టర్లకు భూమి పూజ చేశామన్నారు. షోయబుల్లాఖాన్, రాంజీగోండ్ గారిపేర్లతో స్పెషల్ పోస్టల్ కవర్ రిలీజ్ చేసుకుంటున్నామన్నారు. నరేంద్ర మోదీజీ జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థ నేడు 5వ స్థానంలో ఉందన్నారు. చంద్రయాన్ 3 విజయవంతం అయిందని తెలిపారు. జీ20 ద్వారా దేశ, సంస్కృతి సంప్రదాయాలను మరోసారి ప్రపంచానికి తెలియజేశారని తెలిపారు. జీ 20 ను జీ21గా మార్చిన ఘనత మన ప్రధాని మోదీ ది అన్నారు. ప్రపంచమంతా భారతదేశం సాధిస్తున్న ప్రగతిని ప్రశంసిస్తోందన్నారు. తెలంగాణ చరిత్ర.. ప్రపంచానికి తెలియలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాజ్యంగా ఏర్పడితే.. ఇది భారతమాత కడుపులో కేన్సర్ గా మారిందని పటేల్ గుర్తించారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటం స్ఫూర్తితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పరకాలలో 1500 మంది జాతీయ జెండాను ఎగరేసినందుకు జలియన్ వాలాబాగ్ తరహాలో కాల్చి చంపారని తెలిపారు. పర్భణిలో, బీదర్ లోనూ ఇలాగే జరిగిందన్నారు. వీటి నుంచి విముక్తి కల్పించేందుకు పటల్ సంకల్పించారని తెలిపారు. 10 ఆగస్టు, 1948నాడు.. హైదరాబాద్ సంస్థానం విలీనమే.. దేశ సమైక్యతకు మార్గమని నిర్ణయించారని తెలిపారు. 17 సెప్టెంబర్ నాటికి మిషన్ పూర్తిచేశారని షా తెలిపారు.

Good News: మీకు HDFC , ICICI బ్యాంక్‌లో అకౌంట్ ఉందా..? డబ్బులు లేకపోయినా షాపింగ్ చేసే ఛాన్స్..!