హైదరాబాద్ పర్యటనలో బిజీబిజీగా గడిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మునుగోడు సభ ముగిసిన అనంతరం ఆయన నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. పర్యటన కాస్త ఆలస్యం అయినా.. అమిత్ షా రామోజీరావుని కలవడానికి వెళ్లారు. ఆయనతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లినా అక్కడ ఇద్దరే కనిపించారు. రామోజీరావు-అమిత్ షా కాసేపు కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. తొలుత రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన అమిత్ షాకు రామోజీరావు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. తర్వాత రామోజీరావుతో అమిత్ షా, కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. దాదాపు 45 నిమిషాల పాటు రామోజీ రావు, అమిత్‌షా భేటీ అయినట్టు చెబుతున్నారు.
Read Also: Amit Shah: సీఎం కొడుకే సీఎం అవుతాడు.. దళితుడు కాడు
అనంతరం రామోజీరావుని కలిసిన విషయాన్ని తెలుగులో ట్వీట్ చేశారు అమిత్ షా. రామోజీ రావు గారి జీవిత ప్రయాణం అపురూపమైనది వారు చలనచిత్ర పరిశ్రమకు, మీడియాకు సంబంధించిన లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం. ఈరోజు ఆయనను హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిశాను అన్నారు అమిత్ షా.
శ్రీ రామోజీ రావు గారి జీవిత ప్రయాణం అపురూపమైనది వారు చలనచిత్ర పరిశ్రమకు, మీడియాకు సంబంధించిన లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం. ఈరోజు ఆయనను హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిశాను. pic.twitter.com/euh8HdQOvi
— Amit Shah (@AmitShah) August 21, 2022