NTV Telugu Site icon

Amit shah: తెలంగాణలో ప్రభుత్వం మారబోతోంది..

Amit Shah

Amit Shah

ప్రతీ రాష్ట్రం అభివృద్ధి మేము కట్టుబడి ఉన్నామని.. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ చరిత్ర పోరాటాలతో నిండి ఉందని.. తెలంగాణ ఏర్పాటు కోసం యువత ఏళ్ల తరబడి పోరాడి త్యాగాలు చేశారని ఆయన అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా జూన్, 2014న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చిందని అన్నారు.

తెలంగాణకు ఏం నిధులు ఇవ్వలేదని ప్రచారం జరుతుందని నాకు తెలుసని కానీ.. 2014 నుంచి 2021 వరకు తెలంగాణకు ప్రధాని మోదీ రూ. 2,52,202 కోట్లను ఖర్చు చేశామని.. నాదగ్గర అణా పైసాతో లెక్కలు ఉన్నాయని అన్నారు. అయినా అబద్దాలు చెబుతున్నారని విమర్శంచారు. తెలంగాణపై ఎలాంటి సవతి తల్లి ప్రేమ లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం పంపిన నిధులను సరిగ్గా ఖర్చు చేయడం లేదని విమర్శించారు. వెనకబడిన జిల్లాలు, జిల్లా మినరల్ ఫండ్స్, రామగుండం ఫర్టిలైజర్ ప్యాక్టరీ, ఎయిమ్స్ తెలంగాణకు నిధులు ఇచ్చామని అమిత్ షా అన్నారు. తెలంగాణ ఎప్పుడూ మోదీ గుండెల్లో ఉంటుందని.. కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్రం నుంచి మాకు పెద్దగా సహకారం లభించలేదని అమిత్ షా అన్నారు.

తెలంగాణలో త్వరలోనే ప్రభుత్వం మారబోతోందని.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని తప్పకుండా చేస్తాం అని అమిత్ షా ప్రకటించారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విముక్తి కల్పిండాని గుర్తు చేశారు. ఆనాడు పోలీస్ యాక్షన్ లేకపోతే నేడు తెలంగాణ లేదని అమిత్ షా అన్నారు. బీజేపీ హయాంలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో మూడు రాష్ట్రాలను ఇచ్చామని.. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పట్టించుకోలేదని..2014 ఎన్నికల కోసమే హడావిడిగా రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. వాజ్ పేయి హయాంలో ఏర్పడిన రాష్ట్రాల్లో విభేదాలు లేవని అమిత్ షా అన్నారు.