Allu Ramalingaiah Centenary Celebrations In Park Hayat: పార్క్ హయత్‌లో అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల్ని నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు రామలింగయ్య కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలో కోట శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్, ఆలీ, సునీల్, ఎల్‌బి శ్రీరామ్, రావు రమేష్, పృథ్విరాజ్ తదితరుల్ని సత్కరించారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్యకి నివాళులు అర్పించిన తర్వాత వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రామలింగయ్య జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని లాంచ్ చేయడం, అది మెగాస్టార్ చిరంజీవికి అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సినిమా ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదన్న ఆయన.. సినిమాలో ఇంకా చాలా మార్పులొచ్చాయన్నారు. అయితే.. ఆ మార్పులు వాస్తవాలకు దగ్గరగా ఉండాలని సూచించారు. కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉండాలని.. సినిమా సమాజాన్ని ప్రతిబింబించాలని అన్నారు. సినిమాలోకి వచ్చిన స్వాతంత్ర సమరయోధులు చాలా అరుదు అని పేర్కొన్నారు. ఇక సినిమాల్లో సంపాదించి చిరంజీవి.. ఆ సంపాదన తనకు మాత్రమే ఉంచుకోకుండా, సమాజానికి పంచుతున్నారని తెలిపారు.
అంతకుముందు.. అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో అల్లు స్టూడియోస్ నిర్మించారు. ఈ స్టూడియోస్ స్టూడియోస్ ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, స్టూడియోను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మామయ్య అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నానన్నారు. ఈరోజు అరవింద్, బన్నీ, శిరీశ్, బాబీ సినీ రంగంలో ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారంటే.. దశాబ్దాల క్రితం అల్లు రామలింగయ్య మదిలో మెదిలిన ఆలోచనే కారణమన్నారు. ఆ ఆలోచనే ఇప్పుడు ఒక పెద్ద వ్యవస్థగా మారిందన్నారు. అల్లు కుటుంబంలో భాగం కావడాన్ని తాను అదృష్టంగా భావిస్తున్నానని.. అల్లు స్టూడియో ఒక స్టేటస్ సింబల్ అని తెలిపారు. అల్లు అనే బ్రాండ్‌తో తరతరాల పాటు జనాలు అల్లు రామలింగయ్యను గుర్తుంచుకునేలా స్టూడియోను నిర్మించారని చెప్పారు. అలాగే.. తాము డబ్బు కోసం ఈ స్టూడియోని నిర్మించలేదని, తమ తాత కోరిక తీర్చేందుకు నిర్మించాని అల్లు అర్జున్ చెప్పాడు. . ఈ స్టూడియోలో షూటింగ్‌లు బాగా జరగాలని ఆకాంక్షించాడు.