Peddavagu: భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెదవాగు భారీగా పొంగిపొర్లడంతో బచ్చువారిగూడెం-నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నదికి కట్టలు కట్టడంతో గుమ్మడవల్లి, కొత్తూరు గ్రామాలు నీటమునిగిపోతున్నాయి. పెదవాగు వరద నీటిలో అటుగా వెళ్తున్న ప్రయాణికులు, కూలీలు సహా 51 మంది చిక్కుకుపోయారు. పెదవాగు వరద నీటిలో చిక్కుకున్న ఏపీలోని నారాయణపురం, బచ్చువారిగూడెంకు చెందిన 51 మందిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందం, హెలికాప్టర్ సహాయంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. వారంతా ఊపిరి పీల్చుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు ఇరు రాష్ట్రాల ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, చిర్రి బాలరాజు సహాయక చర్యలు చేపట్టారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు నుంచి వేలేరుపాడుకు కారులో వెళ్తున్న ఐదుగురు ప్రయాణికులు వరదలో చిక్కుకున్నారు. కారు వదిలి చెట్లను పట్టుకుని నవ్వుకున్నారు. అల్లూరిసీతారామనగర్ వద్ద గ్రామస్తులు వారిని రక్షించారు. భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అశ్వారావుపేట పెదవాగు ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ స్వయంగా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతం ఏపీకి సమీపంలో ఉన్నందున, మంత్రి ఆ రాష్ట్ర సీఎస్ నిరబ్‌కుమార్ ప్రసాద్‌తో మాట్లాడి, అతని అభ్యర్థన మేరకు, నదిలో చిక్కుకున్నవారందరిని రక్షించడానికి ఏపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఏపీ, తెలంగాణ అధికారులతో సమన్వయంతో పని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ను ఆదేశించారు.
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి