Munugode By Election: ఊపందుకున్న మునుగోడు రాజకీయం.. రేపు గడప గడపకు రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నికలు ఊపందుకున్నాయి. ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఈనెలాఖరులో వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో.. అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో తక్షణం ఇంటింటికీ ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈనేపథ్యంలో.. అన్ని పార్టీలు వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి.
దీంతో.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని పార్టీ ప్రారంభించిన విషయం తెలిసిందే.. అయితే.. ఇప్పటికే మండలాల వారీగా నియమించిన ఇన్‌ఛార్జులు గ్రామాల్లో తిరుగుతూ కాంగ్రెస్‌కు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు (శనివారం) మునుగోడులో జరిగే కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, మధుయాస్కీతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Also Read
- CM Revanth Reddy: రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
- Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఏ మేరకు హాజరవుతారోననే చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది. ఇక మరోవైపు టిక్కెట్ ఆశావహులు కొన్నాళ్ల నుంచే మండలాల వారీగా ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతివ్వాలని కోరుతున్నారు. దీంతో.. పార్టీ టిక్కెట్ ఎవరికివ్వాలనే దానిపై ఇప్పటికే పీసీసీ సమగ్ర సమాచారాన్ని ఏఐసీసీకి నివేదించింది. ఈనేపథ్యంలో.. మరో వారం, పది రోజుల్లో అభ్యర్థి ప్రకటన వచ్చే అవకాశముందని మాజీ మంత్రి ఒకరు వెల్లడించారు.
NASA Artemis 1 Launch: రేపే ఆర్టెమిస్-1 ప్రయోగం.. సిద్ధం చేసిన నాసా..
తాజావార్తలు
-
Ambati Rambabu: ‘ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు’.. డిప్యూటీ సీఎం పవన్‌పై మాజీమంత్రి అంబటి ఫైర్
-
CM Revanth Reddy: రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
-
Jio Bharat V4: రూ.799కే Jio Bharat V4 4G ఫీచర్ ఫోన్ విడుదల.. యూపీఐ, లైవ్ టీవీ, స్మార్ట్ ఫీచర్స్ తో
-
Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?
-
Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!