NTV Telugu Site icon

Chikoti Praveen: అందులో తప్పేముంది.. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా..

Chikoti Praveen

Chikoti Praveen

Chikoti Praveen: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్‌ పేరు హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఈడీ ముందు చికోటి ప్రవీణ్ హాజరైన విషయం తెలిసిందే. నాలుగో రోజు చికోటి ప్రవీణ్ ఈడీ విచారణ ముగియగా.. ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. విచారణ జరుగుతోందని ఈడీ అడిగిన ప్రశ్నిలన్నింటికీ సమాధానం చెప్పానని ఆయన వెల్లడించారు. విచారణ అంతా పూర్తి అయిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. తనపై వస్తున్న వార్తలు అవాస్తవాలని పేర్కొన్నాడు. తన పేరుతో వచ్చిన ట్వి్టర్, ఫేస్‌బుక్ అకౌంట్లు ఫేక్ అంటూ అని చికోటి ప్రవీణ్ తెలిపారు. తనపై పనిగట్టుకుని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే ఇదే విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.

తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశానని చికోటి ప్రవీణ్ పేర్కొన్నారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని.. ఇకపై కూడా చేస్తానని అన్నారు. క్యాసినో బిజినెస్‌ చేశానన్న ప్రవీణ్.. చేస్తే అందులో తప్పేముందని చెప్పుకొచ్చారు. తనకు చాలామంది రాజకీయ నాయకులతో సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. కానీ కొంతమంది పని గట్టుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈడీ విచారణ పూర్తి అయినా తర్వాత అన్ని వివరాలు వెళ్లాడిస్తానని చికోటి ప్రవీణ్ స్పష్టం చేశారు.

Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డి తప్పు చేశాడు..? అతని ముఖం చూడను..!

చికోటి ప్రవీణ్‌.. రాజకీయ నేతలు కూడా ఆ పేరు ప్రస్తావిస్తూ.. విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ సోదాలు నిర్వహించడంతో చికోటి.. చీకటి సామ్రాజ్యం లింక్‌లు కదులుతున్నాయి.. బాలీవుడ్‌, టాలీవుడ్‌ అనే తేడా లేకుండా.. హీరోయిన్లు, సినీ ప్రముఖులతో సంబంధాలు కలిగిఉన్న ఆయన.. వారికి భారీగా రెమ్యునరేషన్లు ఇచ్చారనే విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే.. చికోటి ప్రవీణ్‌తో పాటు ఈ చీకటి వ్యాపారంలో మాధవరెడ్డి పాత్ర చాలా కీలకమైనదని అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆయన ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.