NTV Telugu Site icon

Harish Rao: ప్రముఖులు అంతా RBVRR హాస్టల్లో ఉన్నవారే..!

Harsih Rao

Harsih Rao

Harish Rao: ప్రముఖులు RBVRR హాస్టల్లో ఉన్నవారే అన్నారు మంత్రి హరీశ్ రావు. రాజ్ బహుదూర్ వెంకట్రామ్ రెడ్డి స్థాపించిన ఎడ్యుకేషనల్ సొసైటీ విస్తరణలో భాగంగా ఈరోజు కొత్త భవనానికి భూమి పూజ చేసుకోవడం సంతోషం వ్యక్తం చేశారు. పేద గ్రామీణ యువతకు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా ప్రపంచ స్థాయి విద్యా సంస్థ, వసతి గృహా సముదాయాన్ని ఏర్పాటు చేయడం కొరకు బుద్వేల్ నందు 15 ఎకరముల ప్రభుత్వ భూమిని కేటాయించి సీఎం తన గొప్ప మనస్సును చాటుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి తగ్గట్టు ఇక్కడ ఏదైనా మంచి యూనివర్సిటీ వచ్చి విద్యార్థులకు ఉపయోగపడితే ఎంతగానో ఈ సమాజానికి మీ సొసైటీకి గర్వకారణంగా నిలుస్తుందన్నారు.

Read also: KTR: సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి

రాజా బహదూర్ వెంకటరాం రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది సేవా ఆధారిత, లాభాపేక్ష రహిత సంస్థ, పేద గ్రామీణ యువతకు వారి ఉన్నత విద్యను చాలా తక్కువ ఖర్చుతో అభ్యసించడానికి సేవలు అందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా బాలికల విద్య కోసం రాజ బహుదూర్ వెంకటరామిరెడ్డి గారు చేసిన కృషి ఈరోజు ఎంతోమంది పేద గ్రామీణ విద్యార్థినిలకు అవకాశాన్ని కల్పించిందని అన్నారు. భారత మాజీ ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు, స్వర్గీయ రావి నారాయణరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, జస్టిస్ ఎ. సీతారాంరెడ్డి, జస్టిస్ బి.పి.జీవన్ రెడ్డి, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, అనేక మంది ప్రముఖులు RBVRR హాస్టల్లో ఉన్నవారే అని గుర్తు చేశారు. భవన నిర్మాణానికి ఐదుకోట్ల నిధులను త్వరలో విడుదల చేసేందుకు కృషి చేస్తామన్నారు. డబ్బులు సంపాదించే విద్యా సంస్థగా కాకుండా పేద విద్యార్థులకు విద్యను అందించి సమాజంలో ఉన్నతమైన విలువలు నెలకొల్పాలని కోరుకుంటున్నానమని తెలిపారు.
Talasani Srinivas Yadav: ఇకపై చెప్పడం ఉండదు సీరియస్ యాక్షన్ తీసుకుంటాము

Show comments