తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈనెల 19 నుంచి జిల్లాల పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ పర్యటన వనపర్తి జిల్లా నుంచి మొదలు పెట్టనున్నారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. వేరుశనగ పరిశోధన కేంద్రం, కర్నె తండ ఎత్తిపోతల పథకం, సబ్ రిజిస్టర్ కార్యాలయం, కొత్త కలెక్టరేట్, రెండు పడకల గదులు ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల 20న సోమవారం జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు.
జనగామలో కూడా ముఖ్య మంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. తర్వాత నాగర్ కర్నూల్, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు అయితే ప్రజల్లో టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను తొలగించుకునేందకు సీఎం జిల్లాల పర్యటనకు తెర తీశారని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తుండటంతో అటు జిల్లా పార్టీ నేతలతో పాటు కార్యకర్తలో ఉత్సాహం కనిపిస్తుంది.
