Site icon NTV Telugu

జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో రసాభాస..నిర‌స‌న‌కు దిగిన బీజేపీ కార్పొరేటర్లు

జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో రసాభాస నెల‌కొంది. దీంతో నిర‌స‌న‌కు దిగారు బీజేపీ కార్పొరేటర్లు. టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రసంగానికి బీజేపీ కార్పొరేటర్లు అడ్డు త‌గిలారు. సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ ల నిధులు ఇస్తున్నారంటూ మాట్లాడొద్దని.. టీఆర్ ఎస్ నాయ‌కుల‌కు వార్నింగ్ ఇచ్చారు బీజేపీ కార్పొరేటర్లు. బీజేపీ కార్పొరేటర్లకు మైక్ ఇవ్వడం పై టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. దీంతో జై తెలంగాణ అంటూ టీఆర్ ఎస్‌, భారతమాతాకి జై అంటూ బీజేపీ పోటాపోటీ నినాదాలు చేశాయి.

దీంతో కౌన్సిల్ సమావేశాన్ని ముగించేశారు మేయర్ గంద్వాల విజ‌య‌ల‌క్ష్మి. స‌మావేశం ముగించ‌డంతో… కౌన్సిల్ హాల్ లో బైఠాయించారు బీజేపీ కార్పొరేటర్లు. ఈ సంద‌ర్భంగా… బిజెపి కార్పొరేటర్ దేవర కరుణాకర్ మాట్లాడుతూ… ప్రజా సమస్యల పై చర్చ కోసం పట్టుబడితే.. మేయర్ మధ్యలోనే సభను రద్దు చేసి వెళ్లిపోయారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కుంభకోణాలు బయట పడ్తాయనే చాలా ప్రశ్నలు తెరపైకి రాకుండా చేశారని మండిప‌డ్డారు.

Exit mobile version