NTV Telugu Site icon

Akbaruddin Owaisi: రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్

Akbaruddin Owaisi

Akbaruddin Owaisi

Akbaruddin Owaisi: రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే.. ప్రొటెం స్పీకర్ గా ఎవరు అన్నదానిపై చర్చలు జరుగుతుండగా.. ప్రభుత్వం అక్బరుద్దీన్ నియమించింది. ప్రభుత్వం రిక్వెస్ట్ ని అక్బరుద్దీన్ ఒప్పుకున్నారని తెలిపారు. అయితే.. రేపటినుండి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే.. అంతకుముందు అసెంబ్లీలో ఎమ్మెల్యేల చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సమావేశాల కంటే ముందే ప్రొటెం స్పీకర్ ను నియమించాల్సి ఉంటుంది. కాగా.. ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ ఒకరిని ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ నియమిస్తారు.

Read also: Tantra Teaser: వణికిస్తున్న తంత్ర టీజర్.. రక్త పిశాచాలు నిజంగానే ఉన్నాయా?

అయితే.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 8 సార్లు ఎన్నిక కాగా, ఇతర సభ్యుల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్ ఆరుసార్లు గెలిచారు. ఇక.. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు ఆరుసార్లు ఎన్నిక కాగా వారిద్దరు మంత్రులుగా ఉన్నారు. మరోవైపు ఎంఐఎంకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీ ఆరుసార్లు శాసనసభ ఎన్నికయ్యారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించాలని నిర్ణయించారు. ఈ విషయమై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సీఎం రేవంత్ సమాచారం అందించారట. దీంతో ప్రభుత్వంరిక్వెస్ట్ ని అక్బరుద్దీన్ ఒప్పుకున్నారని సమాచారం. అయితే ప్రొటెం స్పీకర్‌ ఎవరు? అన్న ప్రశ్నలకు నేటితో తెరపడిందనే చెప్పాలి. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా రేపు అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
Chandrababu: తుఫాన్ ప్రాంతాల్లో కాకుండా ఎక్కడో తిరుగుతున్నాడు.. సీఎంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు