అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకే రోజు రూ.6 వేల కోట్ల రుణమాఫీ ట్రెజరీ చరిత్రలో రికార్డ్ అని ఆయన అన్నారు. రూ.17 వేల కోట్లు 2018 వరకు మొదటి విడతలో రుణమాఫీ చేశాం.. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. రూ.36 వేల వరకు రైతుల రుణాలను వెంటనే మాఫీ చేశామన్నాడు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వెసులుబాటు లభించలేదు.. కరోనా కారణంగా రాష్ట్రం రూ.లక్ష కోట్లు నష్టపోయింది అని వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు.
Read Also: Dragon Fruit: ట్రెల్లీస్ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విధానం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తి చేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ చేయలేరులే అని విపక్షాలు భావించాయి.. విపక్షాల తీరు ఒంటె పెదవులకు నక్క ఆశపడినట్లు ఉన్నది అని ఆయన విమర్శించారు. ఆదాయం ఎలా సృష్టించవచ్చో తెలిసిన వ్యక్తి కాబట్టే తెలంగాణలో కేసీఆర్ పాలన ఇంత గొప్పగా ఉందన్నారు. రూ.5 వేలు, 10 వేలకు ఎకరా భూమి అమ్ముకున్న పరిస్థితి నుంచి నేడు రూ. 20 లక్షల నుంచి రూ.50 లక్షలు కోటి, 2 కోట్ల ధర పలుకుతున్నాయని మంత్రి తెలిపారు.
Read Also: Viral Video: దోమను చంపబోయి బొక్క ఇరగొట్టుకున్నాడు.. వీడియో వైరల్
కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా.. రాష్ట్రంలో విజయవంతంగా పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయం కల్పించిన ఉపాధి మరే రంగం కల్పించలేదు.. తెలంగాణలో అత్యధిక ప్రజల జీవనాధారం వ్యవసాయం.. ఎన్ని పరిశ్రమలు పెట్టినా ఇంత పెద్ద ఎత్తున ఉపాధి లభించదు అని ఆయన పేర్కొన్నాడు. దీని ప్రాధాన్యత గుర్తించిన కేసీఆర్ ఈ రంగానికి చేయూతనిచ్చారని నిరంజన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయ రంగం బలోపేతం అయితే దాని చుట్టూ అల్లుకున్న రంగాలు బలపడతాయని అన్నారు. ఒకప్పుడు వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు అని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Covid Variant: వెలుగులోకి కరోనా కొత్త వేరియంట్.. డబ్ల్యూహెచ్‌వో అలర్ట్
మలిదశ ఉద్యమానికి ప్రజలు అందుకే అండగా నిలిచారు.. పొట్ట చేతబట్టుకుని వలసెల్లిన పరిస్థితి నుంచి నేడు ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి ఉపాధి కోసం వస్తుండడం తెలంగాణలో వ్యవసాయ రంగం సాధించిన విజయం అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పట్నంబాట పట్టిన పల్లెలను తిరిగి పల్లెబాట పట్టించాం..
తెలంగాణ వచ్చిన వెంటనే రైతులకు గత ప్రభుత్వాలు పెండింగ్ లో పెట్టిన ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చాం.. ఆ తర్వాత కరెంటు, సాగునీరు, రైతుబంధు, రైతభీమా పథకాలు ఇచ్చి రైతులు బలపడేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని మంత్రి తెలిపారు. రైతులు పండించిన పంటకు అధిక ఆదాయం లభించేలా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆహార మండళ్లు ఏర్పాటు కాబోతున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు.