NTV Telugu Site icon

Advocate Varma: సంధ్యా థియేటర్ ఘటనపై సీన్ రీ కన్స్‌ట్రక్షన్‌.. లాయర్ ఏమన్నారంటే ?

Advocate Varma

Advocate Varma

Advocate Varma: సంధ్యా థియేటర్‌ తొక్కిస లాట ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటికే ఒకసారి అల్లు అర్జున్‌ స్టేట్‌ను రికార్డు చేసిన చిక్కడపల్లి పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేసి ఇవాళ రెండోసారి ప్రశ్నిస్తున్నారు. దీనిపై అడ్వకేట్ వర్మ మాట్లాడుతూ.. సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే నోటీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నోటీలసు ఇచ్చిన తరువాత దీనికి సంబంధించిన స్టేట్‌ మెంట్‌ ఉంటుందని తెలిపారు. అసలు ఏం జరిగింది అనేదానిపై వివరాలు సేకరిస్తారని తెలిపారు.

Read also:Allu Arjun: ప్రారంభమైన అల్లు అర్జున్ విచారణ.. బన్నీపై ప్రశ్నల వర్షం

అల్లు అర్జున్‌ తెలిపిన వివరాలు తరువాత కూడా.. పోలీసులు ఆశించనంతగా సమాధానం రాకపోతే సంధ్య థియేటర్‌ వద్దకు వెళ్లి పోలీసులు సీన్‌ రీ కన్స్‌ట్రక్షన్‌ చేస్తారని అన్నారు. సంధ్యా థియేటర్‌ వద్ద అసలు జరిగింది ఏమిటి ? అని పోలీసులు సీన్‌ రీ కన్స్‌ట్రక్షన్‌ చేస్తారన్నారు. మృతి, గాయాలు, కోమాపై వంటి జరిగిన ఘటనలపై వివరాలను సీన్‌ రీ కన్స్‌ట్రక్షన్‌ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నారు. దీనిపై నోటీసులు ఇవ్వడంతో పాటు ఈ కేసులో బెయిల్‌ వున్న వ్యక్తి అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి గవర్నమెంట్‌ నన్ను అభాసుపాలు చేసింది అని స్టేట్‌ మెంట్‌ ఇచ్చారని, ఇది సరైంది కాదన్నారు. పోలీసుల సహాయ సహకారాలు మర్చిపోయి అల్లు అర్జున్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టడంపై పోలీసులు విచారిస్తారని తెలిపారు.

Read also:

సీన్‌ రీ కన్స్‌ట్రక్షన్‌ అంటే..
* సంధ్యా థియేటర్ వద్ద అసలు ఏం జరిగింది?
* అల్లు అర్జున్‌ ఎక్కడి నుంచి బయలు దేరారు?
* అల్లు అర్జున్ తో ఎంత మంది వచ్చారు?
* అల్లు అర్జున్ బౌన్సర్లు ఎంత మంది ఉన్నారు? వాళ్లు చేసిన పని ఏమిటి?
* అల్లు అర్జున్‌ వచ్చిన వాహనానికి? శ్రీతేజ్‌, రేవతి వున్న దూరం ఎంత?

అనే ప్రశ్నలకు చిక్కడపల్లి సంధ్యా థియేటర్‌ వద్ద స్వయం పోలీసులు వెళ్లి సీన్‌ రీ కన్స్‌ట్రక్షన్‌ చేస్తారుని అడ్వకేట్ వర్మ అన్నారు. సుమారు పోలీసులు పదివేల వీడియోలు తీసుకున్నారు. ఎక్కడి నుంచి .. ఎటు వెళ్లారు? ఎక్కడ తోపులాట మొదలైంది. అనేది ఆరా తీస్తారు అని తెలిపారు. సంధ్యా థియేటర్ తొక్కిస లాట ఘటనలో చాలా మంది కూడా గాయపడ్డారు. కానీ వారి గురించి బయటకు రాలేదన్నారు. వాటి గురించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారని తెలిపారు. సినిమాకు వచ్చి గామపడ్డవారుకూడా చాలా మంది ఉన్నారన్నారన్నా. ఈ తోపులాట ఘటనలో శ్రీతేజ్‌,  మృతురాలు రేవతి ఘటనలు మాత్రమే బయటకు వచ్చాయని తెలిపారు. ఇంకా ఎంత గాయపడ్డారు అనేది సీన్‌ రీ కన్స్‌ట్రక్షన్‌ చేస్తే తెలుస్తుందన్నారు.  ఎలా జరగింది అనేది పోలీసులు స్వయంగా సంధ్యా థియేటర్‌ కు వెళ్లి తప్పకుండా సీన్‌ రీ కన్స్‌ట్రక్షన్‌ చేస్తారుని అడ్వకేట్ వర్మ అన్నారు.

Show comments