KCR Temple: అభిమానం అంటే పాలతో అభిషేకం చేయడం, పచ్చబొట్టు వేయించు కోవడం, తన అభిమాని కోసం కిలోమీటర్ల మేర నడవడం ఇలా ఎన్నో చేస్తుంటారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రికి ఓ వీరాభిమాని, భారత రాష్ట్ర సమితి అధినేత ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ వున్న ఆలయాన్ని ఆ.. అభిమాని నిర్మించి అందులో కేసీఆర్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు.గోగుల శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రస్తుతం తెలంగాణలోని నల్గొండ జిల్లా నిడమానూరు గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కేసీఆర్ అంటే తనకు మొదటి నుంచి అభిమానమని చెప్పుకొచ్చారు. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ చేస్తున్న ఉద్యమం నుండి, శ్రీనివాస్ తన భావజాలం, స్ఫూర్తికి ఆకర్షితుడయ్యాడు. కెసిఆర్ సిఎం అయిన తర్వాత అతను ఉప్పొంగిపోయాడు.
అంతేకాదు ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ తలపెట్టిన ఉద్యమంలో పాల్గొన్నారు. గోగుల శ్రీనివాస్ తన అభిమానాన్ని చాటుకునేందుకు రూ.20 లక్షలు వెచ్చించి కేసీఆర్ కు గుడి కట్టించాడు. ఆ భూమిని కొని అందులో గుడి కట్టించాడు. అందులో కేసీఆర్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తున్నారు. కేసీఆర్ పై ఉన్న అభిమానం వల్లే ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు శ్రీనివాస్ తెలిపారు. కేసీఆర్ ను భారత ప్రధానిగా చూడాలన్నదే తన కోరిక అని అంటున్నారు.
ఇక .. ఆగస్టు 2021, 21న ఓ అభిమానం తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేసీఆర్ కోటి రాసి అందరిని ఆశ్చర్యపరిచాడు ఖమ్మం నగరానికి చెందిన కోసూరు వెంకట నర్సింహారావు. అయితే.. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడయ్యారు. గురుకులాల్లో మెరుగైన విద్య అందుతుందని తెలుసుకుని తన ఇద్దరు కుమారులు నిహాల్, విశాల్‌ను బీసీ గురుకులాల్లో చేర్పించారు. అంతేకాకుండా.. తన తండ్రి రాధాకృష్ణకు ఆసరా పింఛన్ అందుతుందని.. తన కుటుంబానికి ఇంత మేలు చేసిన కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని కాంక్షిస్తూ రెం డేళ్ల నుంచి కేసీఆర్ కోటి రాసిన విషయం తెలిసిందే..
Wipro: కీలక ఉద్యోగిని తొలగించిన విప్రో.. కారణం ఇదే..