Adilabad: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొద్ది రోజులుగా రెండు పులుల సంచారం హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం జానీ అనే మగ పులి మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మగపులి మహారాష్ట్ర బాటపట్టింది సరే, మరి ఆడపులి ఎక్కడ? అనేది స్థానికుల్లో భయాందోళన నెలకొంది. దాని జాడ ఇప్పటి వరకు అధికారులు తెలుసుకోలేకపోయారు. దీంతో స్థానికుల్లో ఆందోళన ఇంకా ఎక్కువైంది.
కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పులుల సంచారంతో అటు అధికారులకు, ఇటు స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. రెండు పెద్ద పులుల సంచారంతో బయటకు వచ్చేందుకు స్థానికులు భయాందోళనతో ఇళ్లలోనే బిక్కు బిక్కు మంటు గడిపారు. ఈ రెండు పులుల్లో ఒకటి మగ పులి జానీ అని మరోకటి ఆడపులిగా గుర్తించారు అధికారులు. మెటింగ్ సీజన్ కావడంతో ఈరెండు కలయిక కోసమే తిరుగుతున్నట్లు గ్రహించారు. వీటిపై గ్రామస్థులు దాడి చేయకూడదని ఆంక్షలు కూడా పెట్టారు అధికారులు. అంతేకాకుండా.. పశువులపై పులులు దాడి చేస్తే నష్టపరిహారం ఇప్పిస్తామంటూ తెలిపారు. రెండు పులులు సంచరిస్తుండటంతో గ్రామస్థులు అవసరమైతే తప్పా బయటకు రాకూడదని సూచించారు. ఈ రెండు పులులు అడవులు, కొండ,గుట్టలు, పంటచేనులను చుట్టేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇవాళ ఉదయం మగపులి జానీ మహారాష్ర్టకు వెళ్ళిపోయిందని అధికారులు వెల్లడించారు. బేల రేంజి రాంపూర్ నుంచి కోర్పన అడవుల్లోకి జానీ ప్రవేశించిందని తెలిపారు. అక్టోబర్ 23 నుంచి నిర్మల్,ఆదిలాబాద్ జిల్లాల్లో టైగర్ సంచరించి వెళ్లినట్లు గుర్తించారు. అయితే ఆడపులి జాడకోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
TG High Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..