NTV Telugu Site icon

Minister Seethakka: అటవీశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు..

Seethakka

Seethakka

నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. జంగు బాయి జాతర నేపథ్యంలో కెరమెరి మండలం గొండి గ్రామ పరిధిలో గల జంగు బాయి పుణ్యక్షేత్రాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. ఆదివాసులతో కలిసి వారి ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్టలో ఉన్నటు వంటి గుహ లోపలకు వెళ్లి జంగు బాయికి ప్రత్యేక పూజలు, దీప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జంగు బాయి దేవత ఆదివాసుల ఆరాధ్య దైవమని ఎవరు ఏది కోరుకున్న కోరిక నెరవేర్చే దేవత.. ప్రకృతి సహజ సిద్దంగా ఏర్పడిన జంగు బాయి పుణ్యక్షేత్రం ప్రకృతికి ఎలాంటి హానీ కలిగించకుండా అభివృద్ధి చేస్తాం.. పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు కేటాయించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పుష్యమాసంలో జరిగే కేస్లాపూర్ నాగోబా జాతరకు 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. అలాగే, మర్లా వాయి, జంగుబాయి కూడా నిధులు విడుదల చేస్తామన్నారు.

Read Also: Actor Prudhviraj: రోడ్ల మీద డ్యాన్సులు వేసే వాళ్లు మంత్రులు ఏంటి?

ఇక, జిల్లా అభివృద్ధి పనులపై ఉట్నూర్ కేబి కాంప్లెక్స్‌లో ఉమ్మడి జిల్లా అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు ఆయా శాఖల సంక్షిప్త నివేదికలతో మంత్రితో సమావేశం అయ్యారు. కాగా, ప్రజావాణి దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. భూసంబంధిత, ఆసరా, డబుల్ బెడ్ రూం ఇళ్లు, తదితర సమస్యలపై వచ్చిన దరఖాస్తులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడి చేసిన ఘటనపై మంత్రి సీతక్క స్పందించారు. అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అంటూ ఆమె మండిపడ్డారు.

Show comments