Adilabad: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు.. క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర ఎంతంటే..
- ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్ లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం ..
- మార్కెట్ యార్డ్ లో పత్తి కొనుగోలును ప్రారంభించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adilabad: ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్ లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే, ఎంపీ పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. సుమారు 11 కాంటాలను ఏర్పాటు చేశారు. సీసీఐతో పాటు ప్రైవేట్ వ్యాపారులు రంగంలో ఉండనున్నారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించేందుకు మల్టీ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ కు రూ.7521 ప్రకటించింది. అయితే.. తేమ శాతం 8 ఉంటే క్వింటాల్‌కు రూ.7,521 మద్దతు ధర లభిస్తుందని స్పష్టం చేసింది. 9 శాతం రూ.7,445, 10 శాతం రూ.7,370, 11 శాతం రూ.7,295, 12 శాతం ఉంటే రూ.7,220 మద్దతు ధర లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు వరంగల్ ఏనామమాముల మార్కెట్ లో రైతుల ఆందోళన చేపట్టారు. పత్తి రేటు తగ్గడంపై నిరసన తెలిపారు. కాంటాలను రైతులు నిలిపివేశారు. మార్కెట్లో రైతు సంఘం నేతలు నిరసన దిగారు. అయితే దీనిపై బీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గుజరాత్ తరహాలో రూ. 8800 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read
- Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
- Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ - ట్రావెల్స్ బస్సు ఢీ.. 15 మందికి గాయాలు..!
- Balka Suman: జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే..
- RTC Bus: బ్రిడ్జి పై నుంచి కింద పడిన ఆర్టీసీ బస్సు.. 25 మంది ప్రయాణికులు..!
ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి ధర తక్కువగా ఉండడంతో కనీసం పెట్టుబడి రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. చలికాలం వచ్చిందంటే పత్తిలో కనీసం 15 శాతం తేమ ఉంటుంది. అయితే మద్దతు ధర కంటే తక్కువ ధర ఉండడంతో సీసీఐ రంగంలోకి దిగనుంది. ఈ ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతింది. పూత, కాతు దశలో వర్షం కురిసింది. దీంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. సాధారణంగా ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం 7 నుంచి 8 క్వింటాళ్లు మాత్రమే లభించే అవకాశం ఉంది. జిల్లాలో ఈ ఏడాది 4 లక్షల 33 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. దాదాపు 32 లక్షల 47 వేల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది జిల్లాలో 20 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మొత్తం 11 లక్షల 58 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇందులో సీసీఐ ద్వారా 7 లక్షల 58 వేల క్వింటాళ్లు, ప్రైవేటు వ్యాపారులు 3 లక్షల 46 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. గతేడాది పత్తి మద్దతు ధర రూ.7,020 ఉండగా, ప్రైవేటు వ్యాపారులు తొలిరోజు అత్యధికంగా రూ.7,100 కొనుగోలు చేశారు. ఆ తర్వాత ధర తగ్గింది. రైతుకు రూ.6,800 నుంచి రూ.6,500 వరకు ధర లభించింది.
Hyderabad Pubs: బార్ పర్మిషన్ తో పబ్ నిర్వహణ.. పోలీసులు సీరియస్..
తాజావార్తలు
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?