TG Weather: తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రోజంతా వాతావరణం చల్లగా ఉంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండటంతో చలి మరింత తీవ్రంగా ఉంది. ఈ నెలలో ఇంత కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే తొలిసారి. నవంబర్ నెలలో పది డిగ్రీల కంటే తక్కువ నమోదవ్వలేదు. ఈ ఏడాది నవంబరు నెలలోనే ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. చలి, బలమైన గాలుల కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో కనిష్ట ఉష్ణోగ్రత 7.9 డిగ్రీలకు పడిపోవడం ఇదే తొలిసారి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి పెరిగింది.
Read also: Farmers Festival: నేటి నుంచి మూడు రోజుల పాటు మహబూబ్‌నగర్‌లో రైతు పండుగ..
రాష్ట్రం మొత్తం మీద అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే పది ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన జిల్లాలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. బుధవారం నమోదైన పది ఏరియాల్లో ఎనిమిది ఉమ్మడి జిల్లాలోనే ఉండడం గమనార్హం. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 9 గంటల వరకు పొగ ప్రభావం బాగానే ఉంది. దీంతో ఉదయం పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీని చలి వణికిస్తుంది. కొమురం భీం జిల్లా సిర్పూర్ యులో 9 గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 9 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబి లో 10.7గా నమోదైంది. ఇక మంచిర్యాల జిల్లా తపాలపూర్ లో 12.1 గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదు కావడం గమనార్హం.
Top Headlines @9AM: టాప్ న్యూస్!