తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునఃనిర్మించిన యాదాద్రి క్షేతానికి భక్తుల తాకిడి పెరిగిపోతోంది.. దీంతో, మొదట్లో కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించని అధికారులు.. ఈ మధ్యే వారికి గుడ్‌న్యూస్ చెబుతూ.. కొండపైకి వాహనాలకు అనుమతి ఇచ్చారు.. అంతే కాదు, కొండపైకి వచ్చే వాహనాలకు పార్కింగ్ ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు.. ఇక, నిర్దేశించిన సమయం ముగిసిన తర్వాత గంటకు అదనంగా వంద రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు.. అధికంగా ఉన్న పార్కింగ్ ఫీజుతో పాటు.. అదనపు రుసుముపై తీవ్ర విమర్శలు రావడంతో యాదగిరిగుట్ట దేవస్థాన కమిటీ వెనక్కి తగ్గింది.
Read Also: Minister Nagarjuna: టీడీపీ గెలిస్తే.. ఎవర్నీ బ్రతకనివ్వరు
యాదగిరిగుట్ట కొండపై పార్కింగ్ ఫీజు విషయంలో వెనక్కి తగ్గిన యాదగిరిగుట్ట దేవస్థాన కమిటీ.. కొండపైకి వెళ్లే నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్‌కు అదనంగా గంటకు రూ. 100 రుసుమును ఎత్తివేసింది.. కొండపైకి వెళ్లే నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్ ఫీజు రూ.500 యథాతథంగా కొనసాగుతుందని వెల్లడించింది. యాదాద్రిలో పార్కింగ్ ఫీజు నిబంధనల్లో మార్పులు జరిగి.. రూ.100 అదనపు రుసుము ఎత్తివేసినా.. 4 చక్రాల వాహనాలు కొండెక్కాలంటే రూ. పార్కింగ్ ఫీజు రూ.500 చెల్లించుకోవాల్సిందే.