Online Game: ఆన్లైన్ గేమ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆన్లైన్ రమ్మీ గేమ్ కోసం పనిచేస్తున్న పెట్రోల్ బంక్ నుంచి లక్షల రూపాయలను వెచ్చించారు. లెక్కలో 6 లక్షల రూపాయలు తేడా రావడంతో పెట్రోల్బంక్ యాజమాన్యం పోలీసులకు పిర్యాదు చేశారు. అందులో పనిచేస్తున్న యువకుడే ఈ పని చేపట్టడాని తెలడంతో.. రికవరీ పేరిట ఇంటిని రాయించుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు పురుగుల మందు తాగిన ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన హనుమకొండలో కలకలం రేపింది.
Read also: Election Commission: లావాదేవీలపై నిఘా పెట్టండి.. రాష్ట్రాలకు ఈసీ లేఖ
హనుమకొండ జిల్లా పరకాలలోని వెలుమవాడకు చెందిన ఎండీ గౌష్ పాషా గుడెప్పాడ్ లోని జీకే పెట్రోల్ బంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. గౌష్ పాషా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాందించాలనే ఆలోచనతో రమ్మీ ఆన్లైన్ గేము అలవాటు పడి 6లక్షల రూపాయలలో పొగొట్టాడు. పెట్రోల్ పంపులో మేనేజర్ గా పని చేస్తున్న గౌష్ పాషా పెట్రోల్ పంపు కు సంబంధించిన డబ్బులను ఆన్లైన్ గేమ్ కి ఖర్చు చేశాడు. బంకు యజమాని లెక్కలు చెక్ చేసుకోగా సుమారుగా 6 లక్షల వరకు తేడా రావడంతో షాక్ తిన్నారు. వెంటనే ఈ నెల 18న ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఆ డబ్బులు రికవరీ చేసేందుకు గౌస్ పాషా ఇంటిని 100 రూపాయల స్టాంప్ కాగితంపై రాయించుకున్నారు.
Read also: Delhi Liquor Scam: నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ..!
అదే రోజు ఇంటికి చేరుకున్న గౌష్ పాషా ఎంతో కష్ట పడి తన తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటిని బంక్ యజమానులు రాయించుకోవడం తెలిస్తే తట్టుకో లేరని మనస్తాపం చెంది ఈ నెల 19న పురుగుల మందు తాగాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. మీరంతా తనను మరిచిపోవాలని తల్లి, తమ్ముడికి ఫోన్ చేశాడు. దీంతో వారు పోలీసులను సంప్రదించగా, పరకాల బంధం రోడ్డులో పురుగుల మందు తాగి ప్రాణపాయ స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు గౌష్ పాషా వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తన కొడుకు ఆత్మహత్యయత్నానికి బంక్ యాజమానుల వేధింపులే కారణమని బాధి తుడి తల్లి ఎండీ ఫర్వీనా పరకాల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు జైలుకు వెళ్లింది వీళ్లే..?