టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా దూసుకుపోతోంది. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ‘జాతిరత్నాలు’ ఫేం హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ మేరకు ఫిలింనగర్‌లో ఆమె మొక్కలు నాటారు. అనంతరం నటి ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా హీరోలు ఆనంద్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శాన్వీ మేఘనకు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని నటి ఫరియా అబ్దుల్లా సవాల్ విసిరారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ నటి ఫరియాకు వృక్ష వేదం పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు.
