Site icon NTV Telugu

Tragedy : గాలిపటం ఎగురవేస్తూ మరో ప్రాణం గాలిలోకి

Kite

Kite

పండుగ పూట ఆ కుటుంబంలో విషాదం నింపింది. గాలిపటం ఎగురవేస్తూ ఆకాష్ అనే 20 సంవత్సరాల యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్‌లో చోటు చేసుకుంది. మృతిచెందిన యువకుడు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజ శేఖర్ కుమారుడుగా తెలుస్తోంది. గాలిపటం ఎగురవేస్తూ, ప్రమాదవ శాత్తు భవనం పైనుండి ఆకాష్‌ పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది. పండుగ రోజు కుమారుడు మృతి చెందడంతో శోక సముద్రంలో మునిగిపోయింది కుటుంబం. సహచర ఉద్యోగి ఇంట్లో కుమారుడు మృతి చెందడంతో అల్వాల్ పోలీసు స్టేషన్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదిలా ఉంటే.. మరోచోట గాలిపటం ఎగరవేస్తూ ఓ బాలుడు భవనంపై నుంచి కిందపడి దుర్మరణం పాలయ్యాడు. ఏపీలోని ఒంగోలు జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా తాపీ మేస్త్రి బతుకుతెరువు కోసం ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చి నాగోల్‌లో ఇంటిని అద్దెకి తీసుకొని భార్య ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న వెంకటేశ్వర్లు.. కుమారుడు శివకుమార్(13) నాగోల్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. పక్క బిల్డింగ్ పైకి వెళ్లి తోటి స్నేహితులతో గాలిపటం ఎగురవేస్తున్నాడు. అంతలో ఓ కుక్క అతడి మీదకు రావడంతో.. దాని బారి నుంచి తప్పించుకునేందుకు వెనక్కి వెళ్తూ భవనం పై నుంచి పడిపోయాడు. తీవ్ర గాయాలతో బాలుడు శివకుమార్ చనిపోయాడు. అతడి తల్లిదండ్రులు నాగోల్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Exit mobile version