సంగారెడ్డి భూకొలతల శాఖ ఏడీ మధుసూదన్‌రావు ఇళ్లలో ఏసీబీ దాడులు చేసింది. సోదాల్లో కోటి మూడు లక్షల నగదు, 3కేజీల బంగారం,కోటి విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక భూమిని సర్వే చేసి నివేదిక ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసారు మధుసూధన్. ఏడీ మధుసూదన్‌రావుతో పాటు మరో జూనియర్ ను 20 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఉప్పల్ లో ఉన్న మధుసూధన్ ఇంటి పై దాడులు నిర్వహించిన ఏసీబీ… మేడ్చల్ మల్కాజ్ గిరిలోను సోదాలు నిర్వహించింది. అయితే ఈరోజు మధుసూధన్ ను ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.