Telangana University: నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ లో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. భిక్నూర్ సౌత్ క్యాంపస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏసీబీ అధికారులు విచారించారు. వీసీ రవీందర్ గుప్తా అక్రమాలపై ఏసీబీ దూకుడు పెంచింది. నియామకాల్లో భారీగా అక్రమ వసూళ్లు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఈసీని కలవకుండా, సమావేశాలకు హాజరుకాకుండా వివాదాస్పద రీతిలో వ్యవహరిస్తున్న తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. అదనపు పరీక్షా కేంద్రాన్ని అనుమతించేందుకు ఈనెల 17వ తేదీ ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్‌లో ఈసీ సమావేశం జరిగిన రోజే ఆయన అరెస్ట్ తెలంగాణ యూనివర్సిటీలో కలకలం రేపింది.
ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ.. రవీందర్ గుప్తా రూ. 50 వేలు డిమాండ్ చేశారు. దీంతో దాసరి శంకర్ ఈ నెల 14న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 17న (శనివారం) ఉదయం తార్నాకలోని గుప్తా నివాసం పరిసరాలకు ఏసీబీ అధికారులు చేరుకున్నారు. దాసరి శంకర్ నుంచి రూ.50 వేలు తీసుకుని గుప్తా ఇంట్లోకి ప్రవేశించాడు. మాస్టర్ బెడ్‌రూమ్‌లోని అల్మారాలో దాచిన రూ. 50 వేలు గుర్తించారు. ఇంట్లో చాలా సేపు వెతికారు. ఏసీబీకి చెందిన మరో బృందం తెలంగాణ యూనివర్సిటీకి వెళ్లి తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని పరీక్షల నియంత్రణాధికారిని క్యాంపస్‌కు పిలిపించి వివరాలు సేకరించారు. గుప్తాను అరెస్టు చేసి ఏసీబీ కేసుల నిమిత్తం ప్రత్యేక కోర్టుకు తరలించారు. అంతకుముందు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు గుప్తా ‘నో కామెంట్’ అన్నారు. గుప్తా ఆస్తులపై విచారణ జరుపుతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
కాగా, రెండు నెలలుగా ఈసీ సమావేశాలకు వీసీ హాజరుకావడం లేదు. యాదగిరిని రిజిస్ట్రార్‌గా నియమించేందుకు నిరుడు ఈసీ సభ్యులు తమ సమావేశంలో నిర్ణయించగా గుప్తా అంగీకరించలేదు. నెలల తరబడి వర్సిటీలో జీతాలు, ఇతర చెల్లింపులను వీసీ నిలిపివేయడంతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీసీ యాదగిరిని రిజిస్ట్రార్‌గా నియమిస్తూ జూన్ 16న శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనేపథ్యంలో తాజాగా వీసీ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడటం గమనార్హం.
Mega Princess: మెగా ప్రిన్సెస్ కి గ్రాండ్ వెల్కమ్…