NTV Telugu Site icon

Abhiyan Employees: రెగ్యులర్ చేయండి.. సమగ్ర శిక్షా ఉద్యోగులు వినూత్న నిరసన..

Samagra Abhiyan

Samagra Abhiyan

Abhiyan Employees: తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు గత 8 రోజులుగా చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సమగ్రశిక్ష ఉద్యోగులను క్రమబద్ధికరించాలని హనుమకొండ జిల్లా ఏకాశీల పార్క్ వద్ద వినూత్న రీతిలో నిరసన దీక్ష చేపట్టారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు గత 8 రోజులుగా నిరసన చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యాశాఖలో విలీనం చెయాలని డిమాండ్ చేస్తున్నారు. పోతారాజు వేషంతో, మహిళలు బోనాలతో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. చేయాలమ్మ చేయాలని అంటూ పోతురాజుల వేశధారతో వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. కనీస కాలపరిమితిని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న చట్టాల అమలులో ప్రభుత్వ యంత్రాంగం ఏళ్ల తరబడి జాప్యం చేయడం సరికాదన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలి. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఆచరణలో పూర్తిగా విఫలమైనారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చట్టాలు చెబుతున్న అమలులో ప్రభుత్వ యంత్రాంగం సంవత్సరాలుగా జాప్యం చేయడం సరి కాదన్నారు.

19 ఏళ్లుగా కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా సీఆర్పీలు పనిచేస్తున్నారని, అందరికీ విద్య అందించడంలో వారి పాత్ర ముఖ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేశారని, సహజ మరణమైతే రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. మృతులను ప్రభుత్వాలు ఆదుకున్న దాఖలాలు లేవని, వారి జీవితాలు అనాథలుగా మిగిలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్ట్‌టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌లకు ఏడాదికి 10 నెలల వేతనాలు మాత్రమే ఇస్తున్నందున వారికి 12 నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వృత్తి విద్యా ఉపాధ్యాయులుగా గుర్తించాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, జీవిత బీమా, ట్రావెలింగ్ అలవెన్స్‌తోపాటు ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.
Errabelli Dayakar Rao: అభయ హస్తం డబ్బులు వారం రోజుల్లో జమ చేస్తాం