NTV Telugu Site icon

Vikarabad Post Office: వికారాబాద్ లో పోస్ట్ మాన్ నిర్వాకం.. చెత్తకుప్పలో ఆధార్, పాన్, ఏటీఎంలు

Vikarabad

Vikarabad

Vikarabad Post Office: అన్ని రకాల పనులకు ఆధార్ కార్డు అనివార్యంగా మారింది. సిమ్ కార్డు నుంచి విమాన టికెట్ వరకు అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి. దీంతో ఎక్కడికి వెళ్లినా జేబులో ఆధార్ కార్డు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మీరు మీ చిరునామాను మార్చాలనుకుంటే, మీ ఇంటి పేరును మార్చాలనుకుంటే లేదా మీ ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్, పాన్ కార్డ్, అంతేకాదు బ్యాంక్ నుంచి ఏటీఎంలు ఇలా ఏది మార్చుకున్నా నేరుగా మన చేతికి ఇవ్వరు. అవి పోస్ట్ ద్వారా రావాల్సిందే.. అది అందరికి తెలిసిన విషయమే.. ఇది ఎప్పటి నుంచో వస్తున్న రూల్.. కానీ దాన్ని ఓ పోస్ట్ మ్యాన్ చెత్తలో పడేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. చెత్త కుప్పలో వేల సంఖ్యలో ఆధార్, పాన్, లెటర్లు కనిపించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా చౌడపూర్ లో చోటుచేసుకుంది.

Read also: GVL Narasimha Rao: సముద్రాన్ని నిర్లక్ష్యం చేస్తే విశాఖ వాసుల గొంతు కోసినట్లే.. ఇప్పటికైనా మేల్కోవాలి..

వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో నరసింహులు అనే వ్యక్తి పోస్ట్ మాన్ పనిచేస్తున్నాడు. పోస్టాఫీసులకు వచ్చిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, లెటర్లు ఎవరికి ఇవ్వకుండా వచ్చినవాటన్నింటిని కార్యాలయంలోనే పడేశాడు. అలా ఒకటికాదు రెండు కాదు 2011 నుంచి లబ్ధిదారులకు వచ్చిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎంలు, లెటర్లను చెత్త కుప్పలో పడేసాడు. దాదాపు 14 సంవత్సారాల ఆదార్, పాన్, ఏటీఎంలు, లెటర్లు అన్నీ గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో వేయడంతో గ్రామప్రజలు షాక్ తిన్నారు. పోస్ట్ మాన్ గా ఇన్ని రోజులు నెలకు జీతం తీసుకుని చేతులు దులుపుకున్నాడు. అయితే.. వచ్చినవన్నీ పోస్టాఫీసులో చెత్తలా పేరుకుపోతుండటంతో ఎలాగైనా చెత్తకుప్పలో పడివేయడం మంచిదని భావించాడు. గ్రామపంచాయతీకి కాల్ చేశాడు.

దీంతో గ్రామ పంచాయితీ ట్రాక్టర్ అక్కడకు రావడంతో అధార్, పాన్, లెటర్లు, ఏటీఎంలు అన్నీ మూటలో తీసుకుని వచ్చి చెత్తకుప్పలో పారివేయడంతో పోస్ట్ మాన్ భాగోతం వెలుగుచూసింది. కార్యాలయానికి వచ్చినవన్నీ అలాగే పడివేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. దీంతో నిర్లక్ష్యం వహించిన పోస్ట్ మ్యాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులు, గంటల తరబడి ఆధార్ సెంటర్లలో నిలుచుని ఆధార్ తీయించుకుంటే.. వాటిని ఇవ్వకుండా చెత్తకుప్పలో పడవేయడమేంటని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇన్ని రోజులు అడిగినా రాలేదంటూ మాట దాటేస్తు వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉండి వచ్చిన జీతంతో జల్సా చేసుకున్నాడు కానీ.. ప్రజలగురించి ఆలోచించలేకపోయాడని మండిపడ్డారు.
GVL Narasimha Rao: సముద్రాన్ని నిర్లక్ష్యం చేస్తే విశాఖ వాసుల గొంతు కోసినట్లే.. ఇప్పటికైనా మేల్కోవాలి..

Show comments