Aadhaar: పుట్టగానే ఆధార్ నంబర్.. ఆస్పత్రిలోనే కేటాయింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నింటికి ఆధార్ తప్పనిసరి అయిపోయింది.. చిన్నా పెద్ద తేడా లేకుండా ఆధార్ కార్డు చూపించడం, అవసరం అయితే జీరాక్స్ కాపీ ఇవ్వడం జరుగుతోంది.. ఇక, పుట్టగానే ఆధార్ నంబర్ కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది.. ఆస్పత్రిలో పుట్టిన వెంటనే ఆ పసికూనలకు ఆధార్ నంబర్ కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు. అప్పుడే పుట్టిన శిశువులకు ఆస్పత్రుల్లోనే ఆధార్ నంబర్ కేటాయించేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. పైలట్ ప్రాజెక్టు కింద సంగారెడ్డి ఎంసీహెచ్, జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిని ఎంపిక చేసింది..
Read Also: Astrology: జూన్ 17 శుక్రవారం దినఫలాలు
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
అప్పుడే పుట్టిన చిన్నారులకు తల్లి వేలిముద్రను తీసుకుని శిశువు ఫొటోను పోర్టల్లో అప్లోడ్ చేసి.. తాత్కాలిక యూఐడీని కేటాయించనున్నట్టు.. దాని కోసం పైలట్ ప్రాజెక్టు కింద సంగారెడ్డి ఎంసీహెచ్, జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిని ఎంపిక చేసినట్టు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇక, ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఆధారంగా 45 రోజుల తర్వాత మీసేవ కేంద్రాల్లో శిశువు పేరు నమోదుచేసి ఆధార్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
మరోవైపు, ఐదేళ్ల లోపు చిన్నారులకు ఇంటి వద్దే ఆధార్ సేవలు అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం అవుతోంది. సమీపంలోని పోస్ట్ ఆఫీసులో సమాచారం ఇవ్వడం లేదంటే పోస్టుమెన్‌కు ఫోన్ చేసినా.. వారే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.. ఇందుకోసం పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల బయోమెట్రిక్ వివరాలను పోస్టల్ సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా పోస్టల్ సిబ్బంది ఆధార్ కార్డ్ అందించనున్నారు.. పోస్టల్ శాఖ ఈ సేవలను ఉచితంగా అందిస్తోంది.
తాజావార్తలు
-
Virat Kohli: “ప్రతి సీజన్‌ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
-
Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్‌కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
-
AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
-
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..