Site icon NTV Telugu

Brother Wife: అన్న భార్యను ప్రేమించిన తమ్ముడు.. సీన్ కట్ చేస్తే..

A Younger Brother Who Loved His Elder Brother's Wife

A Younger Brother Who Loved His Elder Brother's Wife

Brother Wife: కడుపున పెట్టుకుని చూసుకుంటున్న అమ్మనే నీఛంగా చూసే సమాజంలో బతుకుతున్న కాలం ఇది. అంతేకాదు అన్న భార్య అమ్మతో సమానం అనే మాట ఎప్పుడో మరిచిన లోకంలో జీవిస్తున్నాము. ఆమె ఒక ఆడది అనే మాట తప్ప ఇంకేమి గుర్తుండటం లేదు. నేటి సమాజంలో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. వాంఛ కారణంగా గతాన్ని మరచిపోయి నీచత్వానికి దిగుతున్నారు. కొందరు అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ కాపురాలను ధ్వంసం చేస్తుంటే.. మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది. అన్న భార్యను ప్రేమించిన ఓ వ్యక్తి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా ఆమో నిరాకరించింది. దీంతో ఆవేదనకు గురైన తమ్మడు ప్రాణాలు తీసుకున్నాడు.

Read also: Gate Grills: గేటు గ్రిల్స్ మధ్యలో తల పెట్టిన చిన్నారి.. తరువాత ఏం జరిగిందంటే..

హర్యానాకు చెందిన ప్రదీప్ కుమార్ (23) తన స్నేహితులతో కలిసి పాత బోయిన్‌పల్లి జీఎస్టీ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటూ అక్కడ రవాణా సంబంధిత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రదీప్ కుమార్ అన్నయ్య (పెదమ్మ కొడుకు) శివ కుమార్ కూడా ఉపాధి కోసం నగరానికి వచ్చి భార్యతో కలిసి బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్నాడు. దాంతో ప్రదీప్ అప్పుడప్పుడు అన్నయ్య దగ్గరకు వెళ్లేవాడు. ఈ క్రమంలో అన్న భార్య ప్రదీప్ కుమార్ మధ్య మొదట స్నేహం ఏర్పడింది. అదే స్నేహం ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్య ప్రేమ కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో అన్నయ్య శివకుమార్ ను వదిలేసి పెళ్లి చేసుకోవాలని ప్రదీప్ కుమార్ గత కొంతకాలంగా వదినపై ఒత్తిడి చేస్తున్నాడు. అందుకు ఆమె అంగీకరించలేదు.

బుధవారం (సెప్టెంబర్ 6) ప్రదీప్ కుమార్ మరోసారి వదినకు ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఆమె పెళ్లికి నిరాకరించింది. మరిదిని మార్చడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆవేదనకు లోనైన మరిది ప్రదీప్ ఆమె లేని జీవితం ఊహించుకోలేకపోయాడు. చావే శరణ్యమణి భావించాడు. వదినకు కాల్ చేసి నువ్వులేని జీవితం నాకు వద్దంటూ ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్ పెట్టేశాడు. దీంతో ఆందోళన చెందిన ఆమె వెంటనే తన భర్త శివకుమార్‌కు సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన శివ కుమార్ ప్రదీప్ కుమార్ స్నేహితులకు విషయం చెప్పగా.. వారు గదిలోకి వెళ్లి చూశారు. తాళం వేసి ఉండడంతో తలుపు పగులగొట్టి చూడగా అప్పటికే ప్రదీప్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad: బిల్డింగ్ గోడ కూలి ముగ్గురు మృతి.. పరారీలో బిల్డర్, ఓనర్..

Exit mobile version