lover attacked woman: ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. యువతిపై ప్రేమోన్మాది కత్తితో అతి కిరాతకంగా దాడి చేసాడు. దీంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని వైద్యం కోసం కాచిగూడ ప్రతిమ హాస్పిటల్ కు తరలించారు. బాధితురాలికి ప్రాణాపాయం లేదని ఓయూ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా.. బాధితురాలు ముషీరాబాద్ కు చెందిన డిగ్రీ చదువుతున్న యువతిగా గుర్తించారు. ఆమెపై దాడి చేసిన వ్యక్తి రంజిత్ గా గుర్తించారు పోలీసులు.
ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన డిగ్రీ చదువుతున్న అమ్మాయిపై అదే ప్రాంతానికి చెందిన రంజిత్ అనే వ్యక్తి మాట్లాడదామని ఓయూ సమీపంలోని రావాలని కోరాడు. దీంతో బాధితుడురాలు ఓయూ వద్దకు రాగా.. మాటల్లో పెట్టి రంజిత్ ఒక్కసారిగా ఆమెపై కత్తితో దాడిచేసాడు. విచక్షణారహితంగా దాడిచేయడంతో.. ఆమె ఒక్కసారిగా కుప్పికూలిపోయింది. రక్తపు మడుగులో వున్న ఆమెను అక్కడే వదిలేసి రంజిత్ పరారయ్యాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో దాడి జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని నిందితుని కోసం ఓయూ పోలీసులు గాలిస్తున్నారు.
Rajasthan: కాంగ్రెస్ కీలక భేటీ.. సీఎం మార్పుపై అశోక్ గెహ్లాట్ నివాసంలో మీటింగ్