Jayashankar Bhupally: తుపాకీతో బెదిరించి మహిళ కానిస్టేబుల్ పై ఎస్సై అత్యాచారం..
- భూపాలపల్లి జిల్లా కాటారం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో కలకలం..
- ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై ఎస్సై భవాని సేన్ అత్యాచారం..
- మహిళా హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో వెలుగులోకి సంచలన విషయాలు..
- ఎస్సై పై లైంగిక వెధింపుల కేసు నమోదు..
- రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jayashankar Bhupally: పోలీసులంటే ఓ నమ్మకం.. ప్రజల ప్రాణాలను కాపాడుతారనే భరోసా. కానీ సబ్ ఇన్‌స్పెక్టర్‌ని చూస్తే ఆ స్టేషన్‌లోని వారికి చిరాకు.. చూసిన ఆడవాళ్ళను అనుభవించేదాకా వదలడు. అందుకోసం ఎంతకైనా తెగిస్తాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి మరీ తన కోరిక తీర్చుకుంటాడు. అలాంటి సంఘటనే ఇది. తన సొంత స్టేషన్‌లోని లేడీ కానిస్టేబుల్‌పై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ సబ్ డివిజన్ లో ఈ పోలీసు అరాచకం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సహించలేని ఆ మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సైను అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read also: Union Cabinet Meet: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!
Also Read
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ లోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఎస్సై భవాని సేన్ రాసలీలలు ఒక్కొక్కడి బయటపడుతున్నాయి. పోలీస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై ఎస్సై భవాని సేన్ వరుసగా హత్యాచారం చేసినట్లు వార్తలు సంచలనంగా మారాయి. ఆమెను తుపాకీతో బెదిరంచి అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. అయితే ఇన్ని రోజులు ఎవరికి చెప్పాలో తెలియక ఆత్మహత్యే సరణ్యమని భావించిన మహిళా హెడ్ కానిస్టేబుల్.. ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై భవాని సేన రాసలీలు వెలుగులోకి వచ్చాయి. మహిళా హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు షాక్ తిన్న ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. కాలేశ్వరం ఎస్సై భవాని సేన తన రివాల్వర్ తో మహిళా కానిస్టేబుల్ పై గురిపెట్టి పలుమార్లు హత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు అర్ధరాత్రి అరెస్టు చేసి భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సై భవాని సేనను విచారిస్తున్నారు. ఎస్సై పై లైంగిక వెదింపుల కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిన్న రాత్రి కాళేశ్వరం పియస్ కు వచ్చి అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
RK Roja: రుషికొండ భవనాల వివాదంపై స్పందించిన రోజా.. అది తప్పా..?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?