హైదరాబాద్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.. చార్మినార్, గోల్కొండ, జంట జగరాలను కలపే హుస్సేన్‌సాగర్ అందాలు కనువిందు చేస్తాయి.. ఇక, శివారు ప్రాంతాల్లోనే మరికొన్ని స్పాట్లు కూడా ఆకట్టుకుంటాయి.. త్వరలో హైదరాబాదీలు, పర్యాటకులకు అసలైన థ్రిల్ అందించేందుకు సర్కార్ సిద్ధం అవుతోంది.. రష్యా రాజధాని మాస్కోలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం ఫ్లోటింగ్ బ్రిడ్జిను పోలిన బ్రిడ్జి.. ఇప్పుడు మన హైదరాబాద్‌లో రాబోతోంది.. పీవీఎన్‌ఆర్ మార్గ్‌లో అంటే నెక్లెస్ రోడ్డులో హుస్సేన్ సాగర్ మీద ఈ ఏడాది చివరికల్లా ఆ పర్యాటక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది అంటున్నారు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద కుమార్.. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలు, ఏపీ సహా పలు రాష్ట్రాలు, దేశ, విదేశీ పర్యాటలను ఎంతగానే ఆకట్టుకునే హైదరాబాద్.. త్వరలోనే మరింత కనువిందు చేయనుందన్నమాట.