NTV Telugu Site icon

Mahabubabad crime: అయ్యో తల్లీ ప్రసవం కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయావా.. ఆసుపత్రి వద్ద ఆందోళన

Mahaboobnagar

Mahaboobnagar

Mahabubabad crime: మహబూబాబాద్ జిల్లా మరిపెడ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది. ప్రసవం కోసం వెళ్లి నిండు గర్భణీ ప్రాణాలు కోల్పోయింది. సాధారణ కాన్పు చేస్తానని ఆపరేషన్‌ చేయకుండా నొప్పులతో బాధ పడుతును ఆమెను అలాగే వదిలేసారు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందింది. నిండు గర్భణీ మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేశానికి గురయ్యారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ప్రాణాలు వదిలిందని ఆసుప్రతి వద్ద ఆందోళన చేపట్టారు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన వడ్డురి భాగ్యలక్ష్మి ప్రసవం కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. అయితే అక్కడున్న మరిపెడ లో వైద్యం అందించిన డాక్టర్ రవి సాధారణ ప్రసవం చేస్తానని భాగ్యలక్ష్మి నొప్పులు వస్తున్నా అస్సలు పట్టించుకోలేదు. ఆమెకు వైద్యం కూడా చేయాలేదు. దీంతో భాగ్యలక్ష్మికి తీవ్ర నొప్పులతో అక్కడికక్కడే మృతి చెందింది. సాధారణ ప్రసవ ఆపరేషన్ వికటించి మెరుగైన చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిపెడ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ రవి నిర్లక్ష్యం తోనే ఆమె చనిపోయిందని బంధువుల ఆరోపణ చేశారు. మృతదేహంతో జాతీయ రహదారి పై ధర్నా చేసేందుకు సన్నాహాలు చేపట్టారు.

మృతురాలు స్థానిక మరిపెడ కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కూతురు రెండవ కాన్పుగా తల్లిగారింటికి వచ్చిందని బంధువులు తెలిపారు. అయితే.. సాధారణ హెల్త్ చెకప్ కొరకు ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో డాక్టర్ల అత్యుత్సాహంతో సాధారణ కాన్పు చేస్తానని నమ్మించి ప్రాణాలు తీసారని ఆరోపణ చేశారు. మరిపెడలో వైద్యం అందించిన డాక్టర్ రవి.. మరిపెడ మున్సిపల్ ఛైర్మెన్ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకురాలు సిందూర భర్త కావడం గమనార్హం. బంధువులు ఎలాంటి సంఘటనలకు పాల్పడకుండా అధికార నేతలతో డాక్టర్ పైరెవిలు చేయిస్తు్న్నారని ఆరోపణలు చేసారు. దీంతో అక్కడ పరిస్థితి ఉత్కంఠగా మారింది. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో మృతురాలి బంధులు నిలదీశారు. డాక్టర్‌ నిర్లక్ష్యంతోనే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని మండిపడ్డారు. తక్షణలో న్యాయం చేయాలని డాక్టార్‌ రవిని కఠినంగా శిక్షించాలని కోరారు. న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని తీయమని బంధువులు ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌