NTV Telugu Site icon

Film Nagar Crime: ఫిల్మ్ నగర్‌లో విషాదం.. నాగేళ్ల కుమారున్ని ఉరివేసిన తల్లి.. ఆతరువాత!

Filme Nagar

Filme Nagar

Film Nagar Crime: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది.

ఫిల్మ్ నగర్ లో విశ్వనాథ్, శిరీష కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండున్నర ఏళ్ల బాలుడు మనీష్ ఉన్నాడు. వీరి జీవితం అన్యోన్యంగా బాగానే సాగిన వీరి జీవితంలో శిరీషకు అష్టాలు మొదలయ్యాయి. కానీ భరిస్తూ వచ్చిన శిరీష గర్భవతి అయ్యింది. తన కడుపులో బిడ్డకోసం అన్నీ భరిస్తూ వచ్చిన శిరీషకు బిడ్డ పుట్టిన కూడా అత్తింటి వేధింపులు నుంచి విముక్తి కలగలేదు. బాలుడు మనీష్‌ పుట్టాకకూడా వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. ఇప్పటికి మనీష్‌ కు రెండున్నర ఏళ్ల. ప్రస్తుతం శిరీష మళ్లీ మూడు నెలల గర్భిణి అయ్యింది. శీరీష నెలల గర్భిణి అని తెలిసి కూడా అత్తింటి వేధింపులు మాత్రం అస్సలు ఆగలేదు. తన కష్టాలు పుట్టింటికి చెప్పుకోలేక ఇటు అత్తింటి వేధింపులు భరించలేక కడుపుతో ఉన్నకూడా ఆతల్లి తన రెండున్నరేళ్ల కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంది.

ఎంతకు శిరీష గదిలోనుంచి బయటకు రాకపోవడంతో భర్త విశ్వనాథ్ గదిలోకి వెళ్లిగా షాక్‌ కు గురయ్యాడు. పరుగున బయటకు వచ్చిన విశ్వనాథ్‌ తల్లిదండ్రులకు ఈవిషయం చెప్పాడు. దీంతో భయాందోళన చెంది విశ్వానత్‌ శిరీష ఆత్మహత్య వారి మీదకు కేసు ఎక్కడ వస్తుందో అన్న భయంతో శిరీష కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. అయితే అక్కడకు చేరుకున్న శిరీష కుటుంబ సభ్యులు బోరున ఏడ్చారు. శిరీష మృతి అత్తింటి వేధింపులే అని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాలను ఉస్మానియా కి తరలించిన పోలీసులు. శిరీష, తన కుమారుడి ఉరి వేసి చంపి తనుకూడా ఆత్మహత్య చేసుకుందా? లేక అత్తింటి వారే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తు్న్నారా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
Manipur Violence: మణిపూర్ హింసాకాండపై నేడు అమిత్ షా ఆల్ పార్టీ మీట్