Site icon NTV Telugu

Dog Resembling a Leopard: చిరుతను పోలిన శునకం.. లక్షలు ఇస్తామంటూ యజమానికి ఆఫర్‌..

Dog

Dog

Dog Resembling a Leopard: మనుషుల పోలిన మనుషులే ఉండడం సర్వ సాధారణమైన విషయం.. ఇక, జంతువులను పోలిన జంతువులు కూడా ఉంటాయి.. కానీ, అవి ఒకే జాతికి చెందినవే ఉంటాయి.. కొన్నిసార్లు మాత్రం.. భిన్నమైన జంతువులు కూడా కనిపిస్తుంటాయి.. ఇదంతా ఎందుకు? అంటారా? పెద్దపల్లి జిల్లాలోని ఓ గ్రామంలో చిరుత యద్దేచ్ఛగా తిరిగేస్తుంది.. తెలియని వారిని చూసి బెదిరించే ప్రయత్నం చేస్తుంది.. ఇక, పాతవారుంటే మాత్రం ఏమీ పట్టనట్టుగానే వారి మధ్యలో తిరిగేస్తుంది.. యజమాని సమయానికి పెట్టింది తింటుంది..? అదేంటి? చిరుత ఏంటి? గ్రామంలో తిరగడం ఏంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. విషయం ఏంటంటే.. అది చిరుత కాదు.. చిరుతను పోలిన శునకం అన్నమాట..

Read Also: VishnuKumar Raju: విశాఖ వస్తే లోకేష్‌ను కలుస్తా.. పొత్తులపై అధిష్టానానిదే నిర్ణయం

పెద్దపల్లి జిల్లా పాలింర్ల మండలం బూరుగూడెం గ్రామానికి చెందిన మట్టే రాంబాబు అనే గిరిజనుడు దగ్గర.. ఓ శునకం ఉంది.. ఐదేళ్లుగా దానిని పెంచుకుంటున్నాడు రాంబాబు.. ఆ శునకం.. కొంత చిరుత.. మరికొంత పులి ఆకారంలో కనిపిస్తోంది. దీంతో.. దానిని శునకాన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు స్థానికులు.. పక్క గ్రామాల వాళ్లు కూడా వచ్చి ఆ శునకాన్ని చూసి వెళ్తున్నారటే.. దానిపై వారికి ఉన్న ఆసక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు.. ఇక, రాంబాబుకు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయట.. చిరుతను పోలిన ఆ శునకాన్ని మాకు విక్రయిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తామని యజమానికి ఆఫర్‌ ఇస్తున్నారట వ్యాపారులు.. అయితే, చిరుతను పోలిన తన పెంపుడు కుక్కను విక్రయించడం ఆయనకు ఇష్టం లేదని తెలుస్తోంది.. మరి.. రాంబాబు తన శునకాన్ని విక్రయిస్తారో.. తానే పెంచుకుంటాడో చూడాలి.. కానీ, చిరుతను పోలిన ఈ శునక రాజు మాత్రం.. ఇప్పుడు వైరల్‌గా మారిపోయాడు.

Exit mobile version