Minor Lovers Suicide: ప్రేమ రెండు అక్షరాలు మాత్రమే. కానీ ఆ ప్రేమ అనే మత్తులో మైమరచిపోతుంటారు యువత. మరికొందరైతే ‘ప్రే’ అంటే ప్రేమించడం ‘మ’ అంటే మరిచిపోవడం అని లైట్‌గా తీసుకుని జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే మరికొందరికైతే ప్రేమను తన జీవితంలో ఒక భాగంగా ఫీలవుతూ ఉంటారు. ప్రేమే జీవితం ప్రేమే సర్వస్వం. ఇదే ప్రేమ కొందరిని బలి తీసుకుంటే.. మరి కొందరిని కలుపుతుంది. తెలిసి తెలియని ప్రేమలో పడి కొందరు వారి జీవితాలను ముగించేసుకుంటుంటారు. ప్రేమలో పడినవారు వారి మతాలు, వ్యక్తిత్వాలు, కుటుంబాలు ఏమీ గుర్తుకు రావు. కానీ పెళ్లి మాట వచ్చేసరికి ఇద్దరి కుటుంబాలతో ముడిపడి ఉంటుందని మాత్రం ప్రేమలో పడిన ఇద్దరు ప్రేమికులకు అప్పటి గానీ అర్థంకాదు. దానికి తోడు వారిద్దరు మైనర్లు అయితే ఇక కుటుంబాలు అడ్డుచెప్పకుండా ఏమవుతుంది. దీంతో ఏం చేయాలో తెలియక సినిమాలను ఫాలో అవుతుంటారు కొందరు. దీంతో జీవితంలో వేరే వారితో కలిసి ఉండలేక కలిసి చావడానికి సిద్దపడుతుంటారు. ప్రేమ మత్తులో కుటుంబాలకు దూరం అవుతున్నామని ఆలోచించరు. ఒకరినొకరు కలిసి చనిపోతున్నామని మాత్రమే వారికి గుర్తు ఉంటుంది. ఇలాంటి ప్రేమ కథే సిద్దిపేటలో చోటుచేసుకుంది.
Read also: Nepal PM Wife Passes Away: నేపాల్ ప్రధాని భార్య అనారోగ్యంతో కన్నుమూత
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటకు చెందిన కూరపాటి భగీరథ అదే గ్రామానికి చెందిన తొట్ల నేహ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. దుబ్బాకలో ఇంటర్మీడియట్ చదువుతున్న వీరిద్దరు కొద్దిరోజులుగా కలిసి తిరుగుతుండడంతో ఈ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలిసింది. అయితే రెండు కులాలు విడిపోవడంతో పెద్దలు విడిపోతారని భయపడే మైనర్ ప్రేమికులు ఉన్నారు. ఆ భయం మరింత పెరగడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ మంగళవారం రాత్రి ఎవరూ లేని సమయంలో భగీరథ ఇంట్లో కలిశారు. అనంతరం చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి ఇద్దరు మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ ప్రేమికుడి ఆత్మహత్యతో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Bank Scheme: రిస్క్ లేకుండా.. రూ.5 లక్షలు పొందే సూపర్ స్కీమ్..