NTV Telugu Site icon

Atrocious: మెదక్ జిల్లాలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన చిన్న గాయం

Untitled 1

Untitled 1

Medak: పిల్లలు ఆటలాడుకోవడం సహజం. అలానే కొంత మంది పిల్లలు ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సరదాగా డాన్స్ కూడా చేస్తుంటారు. ఇలా ఆడుకునేటప్పుడో.. డాన్స్ వేసేటప్పుడో కింద పడిపోతూ ఉంటారు. అలా కింద పడినప్పుడు కొన్ని సార్లు చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. ఆ గాయాలను ఆ పిల్లలు గాని.. వాళ్ళ కుటుంబసభ్యులు గాని పెద్దగా పటించుకోరు. అయితే అలాంటి చిన్న గాయాలే కొన్నిసార్లు ప్రాణాలను కూడా హరిస్తాయి అనడానికి ఈ ఘటనే ఉందాహరణ. ఓ బాలుడుకి ప్రమాద వశాత్తు తగిలిన చిన్న గాయం ఆ చిన్నారి ప్రాణాలను తీసింది. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జ్లిలా లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

Read also:Telangana Election 2023: నేటి నుంచి ఓటరు చీటీల పంపిణీ.. 23 వరకు కొనసాగునున్న ప్రక్రియ

మెదక్ జ్లిలా లోని పెద్దేముల్ గ్రామంలో ఓగుల రాజు, లక్ష్మి అనే దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ప్రదీప్‌(11) స్థానిక ప్రైమరీ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు.కాగా సెప్టెంబర్‌ 26 వ తేదీన గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన శోభాయాత్ర సమయంలో ప్రదీప్‌ తన తోటి స్నేహితులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశాడు. ఈ నేపధ్యంలో స్నేహితుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ప్రదీప్ కింద పడిపోయాడు. కిందపడిన సమయంలో ప్రదీప్ కి కడుపు భాగంలో గాయమైంది. అయితే ఆ గాయాన్ని కుటుంబసభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. చిన్న గాయమేగా అని స్థానిక ఆర్ఎంపీ డాక్టర్‌కు చూపించి చికిత్స చేయించారు.

Read also:King Khans: ఈ ఖాన్స్ లేకుండా బాలీవుడ్ లేదు…

అయితే కొద్దిరోజుల తర్వాత ప్రదీప్ కడుపు నొప్పితో తరచూ బాధపడుతుండేవాడు. ఈక్రమంలో తాండూరు లోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా ప్రదీప్ కి కడుపు నొప్పి తగ్గలేదు. దీనితో ఇటీవల హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ప్రదీప్ ను పరీక్షించిన వైద్యులు కడుపులో లివర్‌తో పాటు పలు అవయవాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. కాగా ప్రదీప్ కి చికిత్స ను అందిచడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రదీప్ చికిత్స అందుకుంటూ ఈనెల 13 వ తేదీ రాత్రి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది.