MP Komatireddy: కోమటిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం.. పార్టీ చేరికలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Komatireddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులతో పాటు ఇతర సీనియర్లను కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జానా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉన్నందున కాంగ్రెస్ పార్టీ నేతలు ముందుకు వెళ్లే మార్గాలపై చర్చించనున్నారు. మరోవైపు పార్టీలో చేరికపై కూడా నేతలు చర్చించనున్నారు. ఇతర పార్టీల అసంతృప్తి నేతలను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో కొందరు నేతలు చర్చలు జరుపుతున్నారు.
Read also: Artist Priya: పలుచని చీరకట్టి పరువాలు ఆరబోస్తున్న ప్రియ
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
పార్టీతో టచ్‌లో ఉన్నదెవరు? పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు పార్టీ నేతలంతా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం బస్సు యాత్ర చేయాలా.. లేక మరో రూపంలో ప్రజల్లోకి వెళ్లాలా అనే అంశంపై చర్చించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర నిర్వహించింది. ఈ యాత్రలో పార్టీ సీనియర్లంతా పాల్గొన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇదే తరహాలో యాత్రను నిర్వహించాలని సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
PowerFull Love Story: ప్రేమంటే ఇదేరా.. ప్రియుడ్ని కలిసేందుకు ఊరంతా కరెంట్ కట్ చేసిన ప్రియురాలు
తాజావార్తలు
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!